వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ 76 శాతం మందికి కరోనా

వ్యాక్సిన్ కరోనాకి విరుగుడు కాదు, వ్యాక్సిన్ తీసుకున్నా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని మొదటినుంచీ చెబుతూ వస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఎంతో కొంత ఉపశమనం, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండకపోవడం, ఆస్పత్రిపాలు కావాల్సిన అవసరం రాకపోవడం…

వ్యాక్సిన్ కరోనాకి విరుగుడు కాదు, వ్యాక్సిన్ తీసుకున్నా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని మొదటినుంచీ చెబుతూ వస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఎంతో కొంత ఉపశమనం, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండకపోవడం, ఆస్పత్రిపాలు కావాల్సిన అవసరం రాకపోవడం వంటి ఉపయోగాలు వ్యాక్సిన్ తో ఉంటాయనేది వారి వాదన.

కానీ వ్యాక్సిన్ వల్ల ఉపయోగాలు మరీ తీసికట్టుగా ఉండటమే ఇక్కడ ఆందోళన కలిగిస్తోన్న విషయం. వ్యాక్సిన్ తీసుకున్నవారిపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందనే విషయంలో ఐసీఎంఆర్ చేపట్టిన మొదటి అధ్యయన ఫలితాలు విడుదలయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 76శాతం మంది కరోనాకి గురికావడం ఆందోళన కలిగిస్తున్న విషయం.

వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో 76శాతం మందికి కరోనా అటాక్ అయింది. వీరిలో 16 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. 10 శాతం మంది ఏకంగా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం వచ్చింది. ఈ ఏడాది మార్చి 1నుంచి జూన్ 10వ తేదీ మధ్యన ఈ అధ్యయనం జరిగింది.

కొవాక్సిన్ యాంటీబాడీలు అంతంతమాత్రమే..

కరోనా వచ్చి తగ్గిపోయినవారితో పోల్చి చూస్తే, వ్యాక్సిన్ తీసుకున్నవారిలో యాంటీబాడీల సంఖ్య స్వల్పంగా ఉన్నట్టు పలు అధ్యయనాల్లో తేలింది. అంటే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా కూడా యాంటీబాడీలు చాలా మందిలో వృద్ధి చెందలేదు. 

ఇక భారత్ లో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లలో కొవిషీల్డ్ తో పోలీస్తే, కొవాక్సిన్ లో కేవలం 77 శాతం మాత్రమే యాంటీబాడీల వృద్ధి ఉన్నట్టు కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

వ్యాక్సిన్లకు తలొగ్గని డెల్టా..

డెల్టా వేరియంట్ పై తమ వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని అమెరికా, బ్రిటన్ ఇదివరకే ప్రకటించాయి. అయితే భారత్ లో మాత్రం వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా 76శాతం మంది కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. 

మన దేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. అయితే మార్చిలో సెకండ్ వేవ్ మొదలయ్యాక.. దేశంలో డెల్టా వేరియంట్ ఉధృతి కొనసాగింది. ఈ వేరియంట్ కారణంగా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నవారు కూడా కరోనా బారిన పడుతున్నారు. 

డెల్టా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్లే టీకా తీసుకున్నవారు కూడా వైరస్ తో ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే భారత్ లో పంపిణీ అవుతున్న టీకాలు, డెల్టాని ఎదుర్కోవడంలో మెరుగైన ఫలితాలు చూపించట్లేదని తేలింది.