ఇక క‌బుర్లు క‌ట్టి పెట్టండి

స‌మావేశ‌మేదైనా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ఇష్టానుసారం మాట్లాడే చంద్ర‌బాబు …ఈ ద‌ఫా మాత్రం అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించారు. టీడీపీ శ్రేణులు కూడా ఆశ్చ‌ర్యంపోయేలా …సొంత పార్టీ నేత‌ల‌పై చంద్ర‌బాబు కారాలు మిరియాలు నూరారు.  Advertisement…

స‌మావేశ‌మేదైనా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ఇష్టానుసారం మాట్లాడే చంద్ర‌బాబు …ఈ ద‌ఫా మాత్రం అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించారు. టీడీపీ శ్రేణులు కూడా ఆశ్చ‌ర్యంపోయేలా …సొంత పార్టీ నేత‌ల‌పై చంద్ర‌బాబు కారాలు మిరియాలు నూరారు. 

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ బొక్క బోర్లా ప‌డ‌డంతో చంద్ర‌బాబు సొంత ఇంటిని చ‌క్క‌దిద్దుకునేందుకు క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ను వేదిక‌గా మ‌లుచుకునేందుకు ఆయ‌న నిశ్చ‌యించుకున్నారు.

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ముఖ్య నేత‌ల‌తో చంద్ర‌బాబు గురువారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ నేత‌ల‌ను తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో పార్టీ నేత‌లు తెగించి పోరాడాల‌ని మార్గ‌నిర్దేశం చేశారు. తెగించి పోరాడే వాళ్ల‌కే గుర్తింపు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

సార్వత్రిక ఎన్నికలు జరిగేలోపు ఇదే పెద్ద ఉప ఎన్నికగా భావించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కాకుండా, వాళ్ల స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌కుండా కేవ‌లం కబుర్లు చెప్తే ఇక‌పై కుదరదని బాబు తీవ్ర‌స్థాయిలో సొంత పార్టీ నేత‌ల‌ను హెచ్చరించారు.

ఇక‌పై విధేయతలు, మోహమాటాలు  చెల్లవని చంద్రబాబు తేల్చి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నాయకుల క్షేత్రస్థాయి పనితీరుకు అద్దం పడుతున్నాయని మండిప‌డ్డారు. వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప‌ది కీల‌క అంశాల‌ను గుర్తించి తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ప్ర‌తి ఇంటికి వెళ్లి ప్రజలను చైత‌న్య‌ప‌రిచి మంచి ఫ‌లితాన్ని సాధించాల‌ని సూచించారు. 

తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని 75 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్‌కు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని బాబు సూచించారు. నారాలోకేశ్, అచ్చెన్నాయుడు, ప‌న‌బాక కృష్ణ‌య్య‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, బీదా ర‌విచంద్ర యాద‌వ్‌ల‌తో కూడిన  ఐదుగురు సభ్యులతో తిరుపతి ఉపఎన్నిక పర్యవేక్షణ కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు.  

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్