పీపుల్స్ మీడియా అంటే ఇష్టం వెనుక…?

టాలీవుడ్‌లో బ్యానర్లకు ఓ వాల్యూ వుంటుంది. క్రేజ్ వుంది. దానికి రకరకాల కారణాలు వుంటాయి. సక్సెస్ రేటు, జనాల్లో పేరు, నిర్మాత సర్కిల్ ఇలా చాలా. కానీ పీపుల్స్ మీడియా అనేది వేరే విధంగా…

టాలీవుడ్‌లో బ్యానర్లకు ఓ వాల్యూ వుంటుంది. క్రేజ్ వుంది. దానికి రకరకాల కారణాలు వుంటాయి. సక్సెస్ రేటు, జనాల్లో పేరు, నిర్మాత సర్కిల్ ఇలా చాలా. కానీ పీపుల్స్ మీడియా అనేది వేరే విధంగా ప్రధాన ఆప్షన్ గా మారుతోంది. 

ఒక ప్రాజెక్ట్ సెట్ అయింది. మాస్ డైరక్టర్.. మాస్ హీరో. కానీ ప్రాజెక్ట్ వేరే పెద్ద బ్యానర్ కు చేయాలి. అయితే హీరో పీపుల్స్ మీడియా అంటున్నారట, డైరక్టర్ అటే మొగ్గుతున్నారట. దీని మీద టాలీవుడ్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. పీపుల్స్ మీడియా నిర్వాహకులు సినిమా షూటింగ్ ల విషయంలో మొత్తటి వైఖరితో వుండడమే కారణం అని టాక్. 

శ్రీవాసు-గోపీచంద్ లాంటి ప్రాజెక్ట్ కు 35 కోట్లకు పైగా ఖర్చయిపోయినా, శర్వానంద్-శీరామ్ ఆదిత్య సినిమాకు 45 కోట్లు ఖర్చయిపోయినా (ఇలా అంటే మళ్లీ పీఎమ్ఎఫ్ పీఆర్ టీమ్ ఖండిస్తుంది.. అది వేరే సంగతి) కారణం ఒక్కటే దర్శకుడు సినిమాకు ఎంత ఖర్చు చేయించాలనుకున్నా, ఆ ఫ్రీడమ్ పీపుల్స్ మీడియా దగ్గర దొరుకుతుంది. పైగా హీరోల పారితొషికం అస్సలు బేరాలు ఆడరు అని టాక్ వుంది. ఓ టాప్ హీరోకు 50 అనుకుని 65 ఇచ్చారనే వార్తలు కూడా ఆ మధ్య ఇండస్ట్రీలో వినిపించాయి.

వీటన్నింటి రీత్యా అటు హీరోకు, ఇటు దర్శకుడికి వేరే పెద్ద బ్యానర్ కన్నా ఇది చాలా అంటే కన్వీనియెంట్ కావచ్చు. అందుకే అటు మొగ్గు చూపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే పీపుల్స్ మీడియా కూడా మారుతోంది. కాస్ట్ కటింగ్, ప్రొడక్షన్ కంట్రొలు వంటి విద్యలు నేర్చుకుంటోంది. మరి కొంచెం టైమ్ పడుతుంది మిగిలిన వారిలా జాగ్రత్తగా వుండడానికి.