చిన్నమ్మ.. మాట మీదే వుండాలి

భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. చూస్తుంటే చాలా కాలం తరువాత మళ్లీ మరోసారి తెలుగుదేశం – భాజపా ఒకే తానులో ముక్కలుగా కనిపిస్తున్నాయి.  Advertisement వెంకయ్య నాయుడుకు బలమైన కంట్రోలు పార్టీ…

భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. చూస్తుంటే చాలా కాలం తరువాత మళ్లీ మరోసారి తెలుగుదేశం – భాజపా ఒకే తానులో ముక్కలుగా కనిపిస్తున్నాయి. 

వెంకయ్య నాయుడుకు బలమైన కంట్రోలు పార్టీ మీద వున్నపుడు ఆంధ్రలో ఇలాగే వుండేది. సరే, ఆ సంగతి అలా వుంచితే నిన్నటికి నిన్న పురందేశ్వరి ఓ స్టేట్ మెంటే పడేసారు. జనసేన వ్యవహారాలు ఎలా వున్నా తమ పొత్తు కొనసాగుతుందన్నారు. 

ఎలా? అంటే భాజపా కూడా జనసేనతో కలిసి తేదేపాకు మద్దతు ఇస్తుందా? అలా అయితేనే కదా ఇది సాధ్యం? భాజపాతో సంబంధం లేకుండా, తన పాటికి తాను ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. అది ఆయన ఇష్టం. అలా అయినా ఆయనతోనే వుండాలి అనుకోవడం భాజపాకు గత్యంతరం లేని తనం.

తెలుగుదేశం-జనసేన కలిసి వెళ్లినా భాజపాకు ఓకె అయితేనే వీళ్ల పొత్తు అనేది ఓకె అవుతుంది. అలా కాకుంటే జనసేనతోనే వెళ్లడం అన్నది ఎలా సాధ్యం. అందుకే ఎందుకయినా మంచిది అని ఒక మాట అన్నారు పురందేశ్వరి. జనసేన కలిసి రాకపోతే ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.

అది శభాష్ అయిన మాట. పార్టీ అంటే అలా వుండాలి. నాయకురాలు అంటే అలా వుండాలి. కానీ 175 స్థానాల్లో జనసేనకు అయినా అభ్యర్ధులు దొరుకుతారేమో కానీ భాజాపాకు దొరుకుతారా? కనీసం 75 స్థానాల్లో అయినా కాస్త గౌరవ ప్రదమైన ఓట్లు దక్కుతాయా? ఆ పరిస్థితే వుంటే ఎలా వెళ్తున్నా జనసేనతో పొత్తు వుంటుందని పదే పదే చెప్పుకోవడం ఎందుకు? జనసేన లేకపోతే ఆంధ్రలో భాజపా ఆల్ మోస్ట్ జీరో అన్న సంగతి మరిచిపోతే ఎలా?

కేవలం జగన్ కు వ్యతిరేకంగా తానేం చేసినా, ఏం మాట్లాడినా నెత్తిన పెట్టుకుని ప్రచారం చేసే మీడియా వుంది కనుక పురందేశ్వరి ఏమైనా మాట్లాడవచ్చు. కానీ వాస్తవాలు అన్నీ 2024 లో ఫుల్ క్లారిటీ కి వస్తాయి. కానీ ఒకటే మాట 175 స్థానాల్లో పోటీ చేస్తాం అనే మాట మీద నిల్చోవాలి. అప్పుడే మరోసారి శభాష్ అనిపించుకుంటారు.