హీరోయిన్ తో పెళ్లి.. ఖండించిన హీరో

“హీరో విశాల్, హీరోయిన్ లక్ష్మి మీనన్ పెళ్లి చేసుకోబోతున్నారు.” దాదాపు 2 రోజులుగా వైరల్ అవుతున్న న్యూస్ ఇది. ఎట్టకేలకు దీనిపై హీరో విశాల్ క్లారిటీ ఇచ్చాడు. తన పెళ్లిపై వస్తున్న పుకార్లను ఖండించాడు…

“హీరో విశాల్, హీరోయిన్ లక్ష్మి మీనన్ పెళ్లి చేసుకోబోతున్నారు.” దాదాపు 2 రోజులుగా వైరల్ అవుతున్న న్యూస్ ఇది. ఎట్టకేలకు దీనిపై హీరో విశాల్ క్లారిటీ ఇచ్చాడు. తన పెళ్లిపై వస్తున్న పుకార్లను ఖండించాడు ఈ నటుడు.

“సాధారణంగా నేను నాపై వచ్చే పుకార్లు, అవాస్తవ కథనాలపై స్పందించను. ఎందుకంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ఇప్పుడు లక్ష్మీ మీనన్‌తో నా వివాహం అంటూ పుకార్లు వస్తున్నాయి. నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఇది పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనది. ఈ పుకారుపై నేను స్పందించడానికి కారణం ఒకటే. ఇది ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. ఆమె ఓ నటిగా కంటే, ముందుగా ఓ అమ్మాయి. తనను కించపరిచేలా, తన వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసేలా పుకార్లు వస్తున్నాయి కాబట్టి నేను స్పందిస్తున్నాను. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు.”

తన పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది లాంటి అంశాల్ని డీకోడ్ చేయడం మానేయాలని కోరాడు విశాల్. సమయం వచ్చినప్పుడు పెళ్లికి సంబంధించి తానే అధికారికంగా ప్రకటన చేస్తానన్నాడు.

విశాల్ పెళ్లి వ్యవహారం ఇప్పటిది కాదు. గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ తో డేటింగ్, పెళ్లి అంటూ చాలా కథనాలొచ్చాయి. ఆ తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కు చెందిన అనీషా రెడ్డితో పెళ్లి అన్నారు. నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ పెళ్లి కూడా రద్దయింది.

మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి విశాల్ పెళ్లి అంశం తెరపైకి వచ్చింది. ఈసారి లక్ష్మీ మీనన్ పేరు వార్తల్లోకెక్కింది. అయితే ఇది పుకారు అని తేల్చేశాడు విశాల్. గతంలో విశాల్-లక్ష్మీమీనన్ కలిసి 2 సినిమాల్లో నటించారు.