‘కమ్మ’పల్లెల్లో రీపోలింగ్.. అందుకే ఈ బాధ!

వందకు వందశాతం ఓట్లూ తెలుగుదేశం పార్టీకే పడ్డాయట గత ఎన్నికల్లో! ఏడెనిమిది వందల ఓట్లు ఉన్న బూత్ లలో వందశాతం ఓట్లు ఒకే పార్టీకి పడటం అనేది మామూలుగా జరిగిదే కాదు! ఆ ఊర్ల…

వందకు వందశాతం ఓట్లూ తెలుగుదేశం పార్టీకే పడ్డాయట గత ఎన్నికల్లో! ఏడెనిమిది వందల ఓట్లు ఉన్న బూత్ లలో వందశాతం ఓట్లు ఒకే పార్టీకి పడటం అనేది మామూలుగా జరిగిదే కాదు! ఆ ఊర్ల పేర్లు ఎంత 'కమ్మ' పల్లెలు అయితే మాత్రం, అలా వందకు వందశాతం ఓట్లు ఒకే పార్టీకి పడటం అంటే.. అందులో రిగ్గింగ్ పాత్రే ముఖ్యంగా ఉంటుంది! బూత్ క్యాప్చరింగ్ చేసి, అవతల పార్టీకి ఏజెంటునే లేకుండా చేసి, మొత్తం ఓట్లను ఒకరే వేస్తే తప్ప.. వందశాతం ఓట్లు ఒకే పార్టీకి పడే పరిస్థితి ఉండదు. అందునా రాయలసీమలో!

వైఎస్ఆర్సీపీకి అయినా, తెలుగుదేశానికి అయినా.. మరే పార్టీకి అయినా.. వందకు వందశాతం ఓట్లు పడ్డాయంటే అక్కడ నిజమైన పోలింగ్ జరగలేదు అని అర్థం! ఈసీ కూడా అదే నిర్ధారణకు వచ్చింది. రెండు కమ్మపల్లెలతో సహా ఐదు బూత్ లలో రీ పోలింగ్ కు ఆదేశించింది!

ఈ ఆదేశాలు రావడంలో సీసీటీవీ పుటేజీలే కీలకంగా తెలుస్తోంది. రిగ్గింగ్ దృశ్యాలు చూసి ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకేముంది తెలుగుదేశం పార్టీకి అసహనం పుడుతోంది. 'కమ్మ'పల్లెల్లో రీ పోలింగ్ అనేసరికి.. చంద్రబాబు నాయుడే అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారట.

ఈ అంశంలో ఢిల్లీ వరకూ వెళ్లి ఆయన నిరసన ప్రదర్శన చేయనున్నారట. సీఈసీని కలుస్తారట, రాహుల్ ను కలుస్తారట, మాయవతిని కలుస్తారట! ఐదు పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ కే మరీ అంతమందిని కలిసి చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తారట. ఇలా అయిన దానికీ కాని దానికి హడావుడి చేసే.. చంద్రబాబు నాయుడు ఢిల్లీ రాజకీయం ప్రహసనంగా మారింది. అయినా వారి తీరు మారడం లేదంతే!

మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు నిపుణుడే