Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జూలై హవుస్ ఫుల్

జూలై హవుస్ ఫుల్

పోస్ట్ సమ్మర్ గా జూలై నెలకు ఎప్పుడూ టాలీవుడ్ లో డిమాండ్ వుంటుంది. జూన్ నెలలో స్కూళ్ల వ్యవహారం వుంటుంది కాబట్టి జూలైలో సినిమాల విడుదల ప్లానింగ్ ఎక్కువగా వుంటుంది. ఈసారి జూన్ లో వరల్డ్ కప్ మ్యాచెస్ వున్నాయి కాబట్టి, జూలైలో సినిమాల తాకిడి ఎక్కువ వుండేలా వుంది.

ఇప్పటికే జూలై 12న లేదా ఓ రోజు అటు ఇటుగా శర్వానంద్-సుధీర్ వర్మ కాంబినేషన్ లోని దళపతి సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఇదే డేట్ కు పూరి-రామ్ ల ఇస్మార్ట్ శంకర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎవరో ఒకరు అటు ఇటు మారే అవకాశం వుంది. ఈ డేట్ కే కన్నడ రీమేక్, చిన్న సినిమా 'ర్యాంక్ రాజు' విడుదల వుంది.

జూలై నెలాఖరులో డియర్ కామ్రేడ్ షెడ్యూలు అయివుంది. ఇవికాక ఇంకా ఒకటి రెండు సినిమాలు ఈనెల వైపు చూస్తున్నాయి. ఎందుకంటే, ఆగస్టులో సాహో వుండే అవకాశం వుంది. ఆగస్టులోనే నాని-విక్రమ్ కుమార్ ల గ్యాంగ్ లీడర్ వుంది.

అలాగే  దసరాకు సైరా వుండే అవకాశం వుంది. అందువల్ల అప్పుడు వేరే సినిమాలకు చాన్స్ తక్కువ. అందుకే జూన్ నెలలో సినిమా తాకిడి బాగానే వుండేలా వుంది.

మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు నిపుణుడే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?