Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్ జికే @ 8కోట్లు

ఎన్ జికే @ 8కోట్లు

తమిళ టాప్ హీరో సూర్య న్యూ మూవీ ఎన్ జికే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సెల్వ రాఘవన్ డైరక్షన్ లో ప్రభు నిర్మించిన సినిమా. ఈ సినిమా ఈనెల 31న విడుదల కాబోతోంది. ఈ సినిమా తెలుగు హక్కులు సేల్ డీడ్ పూర్తయింది. తెలుగు థియేటర్ హక్కులను ఎనిమిది కోట్లకు విక్రయించారు. సత్యసాయి సంస్థ అధినేత కే కే రాధామోహన్ ఎన్ జికే హక్కులను తీసుకున్నారు.

ఎన్ జికే సినిమాకు దాదాపు తెలుగు జనాలకు పరిచయం అయిన స్టార్ కాస్టింగ్ వుంది. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు వున్నారు. సూర్యకు మరీ గొప్పగా కాకున్నా, ఇంతో అంతో క్రేజ్ వుంది. అందుకే ఎనిమిది కోట్ల రేటుకు హక్కులు అమ్ముడుపోయాయి.

కేవలం థియేటర్ హక్కులు మాత్రమే రాధామోహన్ వి. ఖర్చులు మాత్రం తమిళ నిర్మాతవే. పబ్లిసిటీ, డిజిటల్ ఖర్చులు అన్నీ తమిళ నిర్మాత ప్రభువే. ఈ నెలాఖరులో సినిమాలు ఏవీలేవు. అందుకే కాస్త క్రేజీ ప్రయిస్ కే ఈ హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు నిపుణుడే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?