Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వాల్మీకి నుంచి దేవీ అవుట్

వాల్మీకి నుంచి దేవీ అవుట్

చాలాకాలం గ్యాప్ తరువాత డైరక్టర్ హరీష్ శంకర్ చేస్తున్న సినిమా వాల్మీకి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్. ఎన్నో బాలారిష్టాలు దాటి షూటింగ్ దశకు వచ్చింది. కానీ ఈ మధ్యనే హీరోయిన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

ఇప్పుడు లేటెస్ట్ గా మ్యూజిక్ డైరక్టర్ కూడా మారిపోయారు. ఇప్పటివరకు ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరక్టర్. కానీ ఓ పాట విషయంలో హరీష్ శంకర్ కు దేవీకి మధ్యలో అభిప్రాయబేధాలు రావడంతో ఆయన కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.

కొత్తగా మిక్కీ జె మేయర్ మ్యూజిక్ డైరక్టర్ గా జాయిన్ అయినట్లు బోగట్టా. 14రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. చాన్నాళ్ల క్రితం తమిళంలో సిద్దార్థ చేసిన సినిమా జిగర్తాండ. అప్పట్లోనే ఇది తెలుగులో డబ్ అయింది కానీ, అనేకానేక కారణాల వల్ల విడుదల కాలేదు. ఆ సినిమాను ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. ఇందులో నెగిటివ్ షేడ్ వున్న క్యారెక్టర్ ను వరుణ్ తేజ ఇప్పుడు చేస్తున్నాడు.

మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు నిపుణుడే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?