Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ విజయం కోసం హొమం?

పవన్ విజయం కోసం హొమం?

ఇది ఇప్పుడే అందిన వార్త కాదు. ఆలస్యంగా అందిన గాసిప్. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి పెద్దలు కొందరికి నరసింహం గారు అనే హొమాల గురువు వున్నారన్నది ఇండస్ట్రీ టాక్. ఆయన చాలా ఖరీదైన హోమాలు చేస్తుంటారని కథనాలు వినిపిస్తుంటాయి. ఇంతకీ ఇప్పటి విషయం ఏమిటంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్, జనసేన విజయం కోరుతు ఆయన ఆధ్వర్యంలో భారీ హోమం జరిగిందన్నది.

ఈ మేరకు ఇప్పుడు కాస్త లేటుగా గాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈ హోమానికి కాస్త భారీగానే ఖర్చయినట్లు తెలుస్తోంది. అయితే హోమం కన్నా హోమంలో వేసిన పూర్ణాహుతికి ఎక్కువ ఖర్చయిందని తెలుస్తోంది. సుమారు 50 వేల ఖరీదైన పట్టుచీరను హోమంలో అర్పించినట్లు టాక్. అలాగే కాస్త బంగారం, వెండి, కొన్ని విలువైన రాళ్లు పూర్ణాహుతి సందర్భంగా హోమగుండంలో వేసారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఈ హోమం ఫలితం ఎలా వుంటుందో తెలియాలంటే 23 వరకు ఆగాలి. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసారు. ఆయన పార్టీ అభ్యర్థులు పలు చోట్ల పోటీ చేసారు. కనీసం పాతిక, ముఫై సీట్లు గెల్చుకుంటామన్నది పవన్ మనోగతంగా వినిపిస్తోంది. అదే జరిగితే హోమం ఫలితం ఇచ్చినట్లే అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?