Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

4 నెలల గ్యాప్ లోనే మరో సినిమా

4 నెలల గ్యాప్ లోనే మరో సినిమా

ఏడాదికి కనీసం 3 సినిమాలు చేయడం నాని స్పెషాలిటీ. తనకు మార్కెట్ పెరిగినప్పటికీ స్పీడ్ మాత్రం తగ్గించలేదు ఈ హీరో. ఇప్పుడు అదే స్పీడ్ లో మరో సినిమా రెడీ చేశాడు. జెర్సీ వచ్చిన 4 నెలల గ్యాప్ లోనే గ్యాంగ్ లీడర్ సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు.

అవును... విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని చేస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాను ఆగస్ట్ 30న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. అంటే జెర్సీ వచ్చిన 4 నెలలకే గ్యాంగ్ లీడర్ థియేటర్లలోకి రాబోతోందన్నమాట.

నిజానికి విక్రమ్ కుమార్ దగ్గర చెక్కుడు వ్యవహారం ఎక్కువ. ఏ సినిమానైనా అలా తీస్తూనే ఉంటాడు. నాని దగ్గర మాత్రం ఈ వ్యవహారం నడవలేదు. ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన తేదీకి సినిమా రిలీజ్ అవ్వాలనే కండిషన్ పెట్టిన నాని, నిర్మాతలకు చెప్పి మరీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయించాడు. ఇప్పటికిప్పుడు ఉన్నఫలంగా సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావడానికి కారణం ఇదే. అలా విక్రమ్ కుమార్ కు డెడ్ లైన్ పెట్టాడు నాని.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి శంషాబాద్ లో షూటింగ్ నడుస్తోంది. వచ్చేనెల 30 నాటికి టోటల్ షూటింగ్ కంప్లీట్ చేయాలనేది టార్గెట్. ఈ సినిమాలో ఆర్ఎక్స్100 ఫేమ్ కార్తికేయ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరక్టర్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?