నితిన్ హీరోగా నిర్మించిన మాస్ట్రో సినిమా ఓటిటికి వెళ్తోందన్న వార్తలు ఇప్పటికే జనాలకు తెలిసిందే. ఈ సినిమా ఓటిటి డీల్ ను క్లోజ్ చేసారు.
Advertisement
హాట్ స్టార్ తో 32 కోట్లకు డీల్ క్లోజ్ అయింది. ఇది కాక అడియో రైట్స్, ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ నిర్మాతకు వున్నాయి. ఇంకోపక్క పబ్లిసిటీ ఖర్చులు ఓ కోటి వరకు ఆదా అవుతాయి.
అంథాదూన్ సినిమా ఆధారంగా మాస్ట్రో ను నిర్మించారు. దాదాపు 29 కోట్ల వరకు ఖర్చయిందని అంచనా. అంటే నిర్మాత సుధాకరరెడ్డికి సినిమా మంచి లాభమే పండించినట్లు లెక్క.
జూలై నెలాఖరుకల్లా కాపీ ఫినిష్ చేసి అందించాల్సి వుంటుంది. ఆగస్టు రెండో వారంలో విడుదల వుండొచ్చు.