తమిళనాట ఒకప్పుడు టాప్ డైరక్టర్ అనిపించుకుని, ఫ్లాపులు ఇచ్చి అవకాశాలు తగ్గి, పక్కన వుండిపోయిన డైరక్టర్ లింగుస్వామి. అలాంటి డైరక్టర్ మొత్తానికి తెలుగు హీరో రామ్ డేట్ లు సంపాదించారు. నిన్నటికి నిన్నే స్క్రిప్ట్ నెరేట్ చేసి ఓకె అనిపించుకున్నారు. స్క్రిప్ట్ అదిరిపోయిందనేలా రామ్ ఓ ట్వీట్ కూడా వేసారు.
కట్ చేస్తే…
తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా హైదరాబాద్ లో దిగిపోయారు. తనకు లింగుస్వామికి వున్న పాత లెక్కలు తేల్చాలని, తన దగ్గర అన్ని కాగితాలు వున్నాయని, తనకు లింగుస్వామికి వున్న లెక్కలు తేలే వరకు వేరే సినిమాల వ్యవహారాలు పక్కన పెట్టాలన్నది జ్ఞాన్ వేల్ రాజా ఫిర్యాదు సారాంశం అని తెలుస్తోంది.
తిరుపతి బ్రదర్స్ (లింగుస్వామి కంపెనీ) నిర్మించిన సినిమాలకు సంబంధించి తమిళనాడులో కొన్ని వివాదాలు వున్నాయి. దానికి సంబంధించే జ్ఞాన్ వేల్ రాజాతో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఈ మేరకు ఇక్కడి సినిమా రిలేటెడ్ సంఘాలు అన్నింటిలో ఫిర్యాదు చేసినట్లు బోగట్టా.