పుష్ప హిందీ డబ్బింగ్ @ 17.5 కోట్లు

సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న భారీ సినిమా పుష్ప. రెండు భాగాలుగా నిర్మాణమయ్యే ఈ సినిమా తొలిభాగం హిందీ డబ్బింగ్ రైట్స్ ను విక్రయించేసినట్లు తెలుస్తోంది 17.5 కోట్లకు హిందీ డబ్బింగ్…

సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న భారీ సినిమా పుష్ప. రెండు భాగాలుగా నిర్మాణమయ్యే ఈ సినిమా తొలిభాగం హిందీ డబ్బింగ్ రైట్స్ ను విక్రయించేసినట్లు తెలుస్తోంది 17.5 కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ విక్రయించినట్లు తెలుస్తోంది. 

పుష్ప సినిమాను పాన్ ఇండియా గా తీయాలని అనుకోక ముందు జరిగిన ముచ్చట ఇది. 2019 లో జరిగింది ఈ డీల్ అని తెలుస్తోంది. అయితే తరువాత ప్లాన్ లు మారాయి. పుష్ప పాన్ ఇండియా సినిమా గా మారింది. ఇప్పుడు ఆ హిందీ డబ్బింగ్ డీల్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వుంటుందని తెలుస్తోంది. 

నిజానికి ఓ విధంగా చూసుకుంటే ఇది కొంచెం తక్కువే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ సినిమాగా తయారువుతోంది. ఇలాంటి సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ కు క్రేజ్ ఎక్కువ వుంటుంది. మరో ఒకటి రెండు కోట్లు ఎక్కువే వచ్చే అవకాశం వుంది అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.

ఇదిలా వుంటే బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లోని అఖండ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ 15 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. 

బోయపాటి సినిమాలకు హిందీ యూ ట్యూబ్ మార్కెట్ లో మంచి క్రేజ్ వుంది. గతంలో వినయ విధేయ రామ సినిమా హక్కులు ఇంతకన్నా ఎక్కువ రేటుకే అమ్ముడుపోయాయి.