టాలీవుడ్ లో షూటింగ్స్ మళ్లీ ఊపందుకున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా సెట్స్ పైకొచ్చాయి. ఇందులో భాగంగా లాంగ్ గ్యాప్ తీసుకున్న సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ కూడా షూటింగ్స్ స్టార్ట్ చేసింది. ఒకేసారి 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చింది.
నాగశౌర్య, రీతూవర్మ జంటగా ఓ సినిమా నిర్మిస్తోంది ''సితార''. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమౌతున్న ఈ సినిమాకు వరుడు కావలెను అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడీ సినిమా ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటరైంది. హీరోహీరోయిన్లపై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ తో పాటు ఇంకొన్ని సీన్స్ తీస్తే టోటల్ సినిమా షూట్ కంప్లీట్ అయిపోతుంది.
అటు 'నరుడి బ్రతుకు నటన' అనే మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చింది ఈ బ్యానర్. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాతో విమల్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ప్రస్తుతం సిద్ధూపై కొన్ని సీన్స్ తీస్తున్నారు.
ఇదే బ్యానర్ పై రావాల్సిన పవన్ కల్యాణ్ సినిమాపై మాత్రం ఇంకా నిర్మాతలు క్లారిటీ ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం, వచ్చేనెల రెండో వారం లోపు ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ మేరకు పవన్ కల్యాణ్ కాల్షీట్లు కేటాయించారు.