భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అమెరికాలో కోవాగ్జిన్ సరఫరాకు యూఎప్‌ఎఫ్‌డీఏ అంగీకరించని సంగతిని మరిచిపోకనే, అలాంటి నిర్ణయమే మరొకటి కోవాగ్జిన్‌కు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. కోవాగ్జిన్‌కు పూర్తిస్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అంగీకరించలేదు.
మరింత క్లినికల్ ట్రయల్స్ డేటా కావాలని భారత్ భారత్ బయోటెక్‌కు డీసీజీఐ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫుల్‌లైసెన్స్ పొందేందుకు మరో ఏడాది ఎదురు చూడక తప్పని సరి పరిస్థితి.
ఇది ఒక రకంగా కోవాగ్జిన్‌కు అసౌకర్యం కలిగించే అంశమే. ఎందుకంటే క్లినికల్ ట్రయిల్స్‌పై ఇంకా స్పష్టత రాని పరిస్థితుల్లో దాన్ని వాడేందుకు అనుమాంచే ప్రమాదం ఉందని భారత్ బయోటెక్ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం మన దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతించింది. తాజాగా 77.8శాతం సమర్ధత ఉందంటూ డీసీజీఐకి కొవాగ్జిన్ డేటా ఇచ్చింది. మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై చేసిన భారత్ బయోటెక్ సంస్థ తన డేటాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం పంపించిన సంగతి తెలిసిందే.
ఏది ఏమైనా టీకా వినియోగంలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి తప్పని సరి. దాని అనుమతిపైనే ఏ ఫార్మసీ ప్రొడక్ట్ అయినా వాడకం ఉంటుంది. ఇప్పటికే కోవాగ్జిన్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లేకపోవడంతో విదేశాలకు వెళ్లే వారు కోవాగ్జిన్ వేసుకునేందుకు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే.