Advertisement

Advertisement


Home > Movies - Movie News

జగన్ నిర్ణయం కోసం ఎదురుచూపులు

జగన్ నిర్ణయం కోసం ఎదురుచూపులు

టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఆంధ్ర సిఎమ్ జగన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. జూలై 1 నుంచి థియేటర్లు తెరవడానికి అనుమతిస్తారా? లేదా? అని ఆసక్తిగా వేచి వున్నారు నిర్మాతలంతా. 

తెలంగాణలో నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోవచ్చు. కానీ ఇంకా తెరవలేదు. దానికి కారణం సినిమాల విడుదలకు నిర్మాతలు రెడీగా లేకపోవడమే.

ఆంధ్రలో థియేటర్లు తెరచుకుంటే తప్ప నిర్మాతలు సినిమాలను విడుదల చేయడానికి వీలు కాదు. అందుకే ఈనెల 30 కి కాస్త ముందుగా ఆంధ్ర సిఎమ్ జగన్ ప్రకటించబోయే కోవిడ్ నిబంధనల సడలింపు గురించే నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం రాత్రి మాత్రమే కోవిడ్ నిబంధనలు అమలు లో వున్నాయి. జూలై 1 నుంచి వాటిని కూడా ఎత్తి వేసే అవకాశం వుంది. అయితే అలా అని చెప్పి థియేటర్లకు అనుమతి ఇస్తారా? అన్నది అనుమానంగానే వుంది. 

ఇంకా నిత్యం నాలుగయిదువేల కేసులు వస్తున్నాయి. డెల్టా ప్లస్ వైరస్ భయం అలాగే వుంది. అందువల్ల జగన్ త్వరపడి థియేటర్లు తెరుస్తారా? అన్నది అనుమానం.

జూలై 1 నుంచి కాకపోయినా 10 నుంచి అయినా థియేటర్ల తెరవడానికి అనుమతి ఇస్తారని టాలీవుడ్ జనాలు ఆశగా వున్నారు. అందుకే జూలై మూడో వారం నుంచి సినిమాల విడుదల ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు కూడా చిన్న, మీడియం సినిమాలు మాత్రమే విడుదలవుతాయి. 

ఎందుకంటే ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ మాత్రమే ఆంధ్రలో వుంటుందని భావిస్తున్నారు. పైగా టికెట్ రేట్లు తక్కువ. వీటన్నింటి దృష్ట్యా పెద్ద సినిమాలకు వర్కవుట్ కాదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?