రాథాకృష్ణ ఎంత పని చేశాడో చూడండి!

ఆంధ్రజ్యోతి పత్రిక నుంచి దాదాపు 150 మందిని నిర్ధాక్షిణ్యంగా తొలిగించాడు ఆ సంస్థ ఎండీ రాధాకృష్ణ. వాళ్లకు 25 శాతం వేతనాన్ని ఇచ్చి ఇంటికి పంపించాడు. మీ సేవలు ఇక చాలు, అవసరమైతే కబురు…

ఆంధ్రజ్యోతి పత్రిక నుంచి దాదాపు 150 మందిని నిర్ధాక్షిణ్యంగా తొలిగించాడు ఆ సంస్థ ఎండీ రాధాకృష్ణ. వాళ్లకు 25 శాతం వేతనాన్ని ఇచ్చి ఇంటికి పంపించాడు. మీ సేవలు ఇక చాలు, అవసరమైతే కబురు పెడతాం అంటూ సాగనంపాడు. ఇక్కడే తన బుద్ధిని మరోసారి బయటపెట్టాడు రాధాకృష్ణ. తీసేసిన ఉద్యోగులకు ఇచ్చిన 25శాతం వేతనాన్ని తన సంస్థ నుంచి ఇవ్వలేదు.

అవును.. సంస్థలో కొనసాగుతున్న ఉద్యోగుల జీతాల్లోంచి 25శాతం వేతనాన్ని కట్ చేశాడు. అలా కట్ చేసిన 25శాతం జీతాన్ని ఉద్యోగాల నుంచి తీసేసిన వాళ్లకు ఇచ్చాడు. చూశారుగా.. రాధాకృష్ణ దుర్మార్గం. అలా తన జేబులోంచి చిల్లిగవ్వ కూడా తీయకుండా (పరిహారం ఇచ్చామని పైకి చెప్పుకుంటూ) ఉద్యోగుల్ని తప్పించాడు.

ఏ సంస్థ అయినా ఉద్యోగుల్ని తొలిగించినప్పుడు నష్టపరిహారం చెల్లిస్తుంది. చాలా సంస్థలు ఒక నెల జీతాన్ని పరిహారంగా అందించి ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలైతే 4-5 నెలల జీతాన్ని ముందుగానే చెల్లించి ఉద్యోగుల్ని తొలిగిస్తుంది. గతంలో స్టార్ మా యాజమాన్యం ఇలానే చేసింది. మరికొన్ని సంస్థలైతే 2 నెలల పాటు ఉద్యోగంలో కొనసాగిస్తూ.. ప్రత్యామ్నాయం చూసుకోమని చెబుతుంటాయి. కానీ రాధాకృష్ణ మాత్రం ఉన్న ఉద్యోగుల పొట్ట కొట్టి, తీసేసిన ఉద్యోగులకు పంచాడు.  

గడిచిన పదేళ్లలో తన మీడియాను అడ్డంపెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు రాధాకృష్ణ. మరీ ముఖ్యంగా చంద్రబాబు జమానాలో రాధాకృష్ణ తన ఆస్తుల్ని కొండలా పెంచుకున్నారు. ఇప్పుడు అందులోంచి ఒక్క రూపాయి కూడా విధుల నుంచి తప్పించిన జర్నలిస్టులకు ఇవ్వడానికి ఈ పెద్ద మనిషికి మనసొప్పలేదు. పైపెచ్చు తన పత్రిక, ఛానెల్ లో నీతులు మాత్రం బాగా చెబుతాడు. అటు టీవీ5 యాజమాన్యం కూడా అంతే. పైసా కూడా పరిహారం చెల్లించకుండా 11 మంది కెమెరామెన్లను తొలిగించి, ఛానెల్ లో నీతులు మాత్రం బాగా చెబుతోంది. 

జగన్ కి చంద్రబాబు కి ఉన్న తేడా అదే

జగన్ గారే దేశంలో నెం.1 ముఖ్యమంత్రి