మహాగో(నా)డు 1 : ఎంతగొప్ప ఆత్మవంచన?

‘‘సమయం లేదు మిత్రమా.. శరణమా రణమా’’ అని నందమూరి బాలకృష్ణ ఓసినిమాలో డైలాగు పలుకుతారు. అక్కడ సమయం లేకపోవడం నిజమే కావొచ్చు. కానీ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు – పార్టీ మహానాడు నిర్వహణకు సమయం…

‘‘సమయం లేదు మిత్రమా.. శరణమా రణమా’’ అని నందమూరి బాలకృష్ణ ఓసినిమాలో డైలాగు పలుకుతారు. అక్కడ సమయం లేకపోవడం నిజమే కావొచ్చు. కానీ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు – పార్టీ మహానాడు నిర్వహణకు సమయం లేదనడం ఏమిటి? మహానాడును నిర్వహించుకోడానికి మొహం చెల్లని పరిస్థితి ప్రస్తుతం వారికి ఉండవచ్చు గానీ.. సమయం లేదనడం అనేది ఎంత గొప్ప ఆత్మవంచన?

సాధారణంగా పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 27 నుంచి మూడురోజుల పాటూ తెదేపా మహానాడును నిర్వహిస్తుంది. ఏ ఏడాది నిర్వహించినా అవే తేదీలు. అంతే తప్ప.. నిర్వహణ సమయం హఠాత్తుగా ముంచుకువచ్చేది ఎంతమాత్రమూ కాదు! పైగా ఈ ఏడాది తెదేపాకు మహానాడును మరింత  వైభవంగా నిర్వహించడానికి మరింత సమయం ఉంది. ఎందుకంటే.. ఏఫ్రిల్ 11న ఎన్నికలు ముగిసిన తర్వాత.. వారికి ఇప్పటిదాకా పనిలేదు. పార్టీ నాయకులంతా ఖాళీగా ఉన్నారు. మే 27 లోగా అంటే ఒకటిన్నర నెలరోజుల్లో ఓపినంత ఏర్పాట్లు చేయగలిగే అవకాశం ఉంది.

పార్టీకి మాత్రమేకాదు, నిజానికి పోలింగ్ ముగిసిన నాటినుంచి చంద్రబాబు సహా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా పనిలేదు. ఏదో మేం ఉద్ధరించేస్తున్నాం… సమీక్షలకు మాకు అనుమతి కావాలి.. అంటూ వారు రాద్ధాంతం చేయడమే తప్ప… నాయకుల సమీక్షలతో నిమిత్తం లేకుండా… ఫొణి తుపాను సహాయక చర్యలనుంచి ప్రతి పని కూడా అధికారులు సమర్థంగా పూర్తి చేసేస్తున్నారు.

ఇంత భారీగా ఓపినంత ఖాళీ సమయం పెట్టుకుని… మహానాడు నిర్వహించడానికి ఏర్పాట్లకు తగిన సమయం లేదని.. చంద్రబాబు చెప్పడం అనేది ఆత్మవంచన గానే కనిపిస్తోంది. 23వ తేదీన ఫలితాలు రానున్న నేపథ్యంలో… ఓటమి తమను వరిస్తే గనుక.. ఆ వెంటనే మహానాడు నిర్వహించుకోవడం సిగ్గుచేటు అవుతుందని వారు భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

మహానాడు నిర్వహించే ధైర్యం లేక.. ప్రజల తిరస్కారాన్ని మళ్లీ వేదికలపై గుర్తుచేసుకోవడానికి భయపడి వాయిదా వేశారని ప్రజలు అనుకుంటున్నారు.

మహాగో(నా)డు 2 : మాకు బ్యాండేస్తున్నారా?

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!