విశాఖ మేయర్ గా జగన్ బెస్ట్ చాయిస్…!

విశాఖ మేయర్ ఎవరు అన్నది చివరి నిమిషం వరకూ సస్పెన్స్ లో ఉంది. మొత్తానికి విశాఖ మేయర్ గా విద్యాధికురాలు అయిన గొలగాని వెంకట హరి కుమారిని ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి…

విశాఖ మేయర్ ఎవరు అన్నది చివరి నిమిషం వరకూ సస్పెన్స్ లో ఉంది. మొత్తానికి విశాఖ మేయర్ గా విద్యాధికురాలు అయిన గొలగాని వెంకట హరి కుమారిని ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

విశాఖ సిటీలో అతి పెద్ద జనాభా ఉన్న ఒక వర్గం నాలుగు దశాబ్దాలుగా టీడీపీకే మద్దతు ఇస్తూ వచ్చింది. ఇపుడు ఆ వర్గానికి నగర ప్రధమ‌ పౌరుడిగా అవకాశం ఇచ్చి జగన్ తానే ఏపీలో అతి పెద్ద  బీసీ పక్షపాతిని అని నిరూపించుకున్నారు అంటున్నారు.

అంకితభావం, చిత్తశుద్ధి, నగర రాజకీయాలు, పరిస్థితుల పైన పూర్తి అవగాహన కలిగిన కుమారిని మేయర్ గా చేయడం ద్వారా జగన్ తానేంటో చెప్పకనే చెప్పారు. 

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపధ్యంలో సరైన ఎంపికగా దీన్ని అంతా చూస్తున్నారు. మొత్తానికి ప్రతిష్టాత్మకమైన విశాఖ మేయర్ పదవిని మహిళలకు అప్పగించి వారిని మహరాణులుగా  జగన్ చేశారు అంటున్నారు.

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్