ఓటీటీలో ఫ్లాప్.. టీవీల్లో సూపర్ హిట్

కొన్ని సినిమాలంతే. థియేటర్లలో పెద్దగా క్లిక్ అవ్వవు. కానీ బుల్లితెర వీక్షకుల్ని మాత్రం మహా బాగా మెప్పిస్తాయి. మహేష్ బాబు నటించిన అతడు సినిమా దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ కాగా.. ఇప్పుడీ లిస్ట్ లోకి…

కొన్ని సినిమాలంతే. థియేటర్లలో పెద్దగా క్లిక్ అవ్వవు. కానీ బుల్లితెర వీక్షకుల్ని మాత్రం మహా బాగా మెప్పిస్తాయి. మహేష్ బాబు నటించిన అతడు సినిమా దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ కాగా.. ఇప్పుడీ లిస్ట్ లోకి నయనతార నటించిన అమ్మోరు తల్లి అనే సినిమా కూడా చేరింది. వరల్డ్ టెలిజిన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన ఈ సినిమాకు ఏకంగా 6.60 టీఆర్పీ వచ్చింది.

గతేడాది నవంబర్ లో లాక్ డౌన్ టైమ్ లో డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమాను డైరక్ట్ రిలీజ్ చేశారు. కానీ తెలుగు ఆడియన్స్ కు ఇది పెద్దగా నచ్చలేదు. మరీ పాత చింతకాయపచ్చడి కథ, కథనం ఉండడంతో ఎవ్వరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.

కేవలం ఇదే కారణంతో ఈ మూవీ శాటిలైట్ రైట్స్ కూడా చాన్నాళ్లు అమ్ముడుపోలేదు. ఎట్టకేలకు స్టార్ మా ఛానెల్ ఈ సినిమా రైట్స్ దక్కించుకొని ప్రసారం చేస్తే, మంచి రేటింగ్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే సాహో, సైరా లాంటి సినిమాలకు వచ్చిన టీఆర్పీ  కంటే ఇది బెటర్ రేటింగ్.

భక్తి పేరిట దేవుడి మాన్యం భూముల్ని దోచేసే దొంగ బాబా ఆట కట్టించడానికి స్వయంగా అమ్మవారు భూమికి వస్తారు. తన భక్తుడి సాయంతో దొంగ బాబా ఆట కట్టిస్తారు. ఇదే ఫార్ములాతో గతంలో వచ్చిన కథలకు భిన్నంగా సీరియస్ గా కాకుండా, కాస్త కామెడీ యాడ్ చేసి అమ్మోరు తల్లి సినిమా తెరకెక్కింది.

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్