విచారణంటే అంత భయమెందుకు బాబూ..?

అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తుని నానా రాద్ధాంతం చేస్తోంది టీడీపీ. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను కొనడమే ఓ నేరమైతే.. దాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పి పరిహారం పొందడం మరీ నేరం. ఆ…

అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తుని నానా రాద్ధాంతం చేస్తోంది టీడీపీ. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను కొనడమే ఓ నేరమైతే.. దాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పి పరిహారం పొందడం మరీ నేరం. ఆ నేరానికి సంబంధించి వివరాల సేకరణ కోసం సీఐడీ నోటీసులిస్తే… అసలు ఆ కేసు విచారణే వద్దంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం మరీ విడ్డూరం.

విచారణకు పిలవడం, తెలిసిన నిజాలు చెప్పాలనడం, సీఐడీ అధికార పరిధికి లోబడి చేసిన పనే. అయితే చంద్రబాబు తాను కేసులకు అతీతుడనని ఫీలవడం వల్లే వ్యవహారం ముదిరింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ని సవాలు చేస్తూ చంద్రబాబు కోర్టుకెక్కారు. ఆ ఎఫ్ఐఆర్ ని రద్దు చేయాలని బాబు తరపున న్యాయవాదులు పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

సీఐడీ నోటీసులో ఏముంది..?

సీఆర్పీసీ 41-ఎ-1 ప్రకారం సీఐడీ చంద్రబాబుకి నోటీసులిచ్చింది. నోటీసులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉండకపోయినా, విచారణకు హాజరు కాకపోయినా చట్ట ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందని అందులో ఉంది. ఈనెల 23 ఉదయం 11గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు అధికారులు.

ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు.. ఐపీసీలోని 166, 167, 217 తదితర సెక్షన్లు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లోని సెక్షన్ 3-1ఎఫ్,జి ని కూడా పొందుపరిచారు. అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం కూడా ఇందులో ఉంది. చంద్రబాబుని ఏ-1 గా, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను ఏ-2గా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

విచారణ అంటే అంత భయమెందుకు..?

విచారణకు భయపడే చంద్రబాబు హైకోర్టు మెట్లెక్కారని అర్థమవుతోంది. కుదరని పక్షంలో చంద్రబాబు అరెస్ట్ కి సిద్ధపడతారేమోననే అనుమానం కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. అమరావతి విషయంలో చంద్రబాబు చేసిన పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. 

పదే పదే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని వివరణ ఇస్తున్న చంద్రబాబు వర్గం.. అసలు ఎస్సీ, ఎస్టీల దగ్గర అసైన్డ్ భూములు ప్రైవేటు వ్యక్తులు ఎందుకు కొనుగోలు చేశారనే విషయంపై నోరు మెదపడంలేదు. సీఐడీ విచారణ జరిగితే.. బాబు బండారం మొత్తం బయటపడే అవకాశం ఉంది. 

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్