అనిల్ రావిపూడి..కొడుకు పేరుకు సినిమా సెంటిమెంట్!

త‌మ సినిమాల‌కూ, ఫ్యామిలీ సెంటిమెంట్ల‌కు సినిమా వాళ్లు ముడిపెట్ట‌డం మామూలే. చాలా మంది ఇలాంటి సెంటిమెంట్ల‌ను ఫాలో అయ్యారు. త‌మ ఇంట్లో వాళ్ల పేర్ల‌ను సినిమాల్లో ప్ర‌స్తావించే వాళ్లు కొంద‌రు, సినిమాల్లోని పేర్ల‌ను ఇంట్లో…

త‌మ సినిమాల‌కూ, ఫ్యామిలీ సెంటిమెంట్ల‌కు సినిమా వాళ్లు ముడిపెట్ట‌డం మామూలే. చాలా మంది ఇలాంటి సెంటిమెంట్ల‌ను ఫాలో అయ్యారు. త‌మ ఇంట్లో వాళ్ల పేర్ల‌ను సినిమాల్లో ప్ర‌స్తావించే వాళ్లు కొంద‌రు, సినిమాల్లోని పేర్ల‌ను ఇంట్లో ఫాలో అయ్యే వారు మ‌రి కొంద‌రు. ఈ క్ర‌మంలో ఈ జాబితాలో చేరాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.

ఇటీవ‌లే రిలీజ్ అయిన త‌న సినిమా లో హీరో క్యారెక్ట‌ర్ పేరునే త‌న త‌న‌యుడికి పెట్టుకున్నాడ‌ట ఈ ద‌ర్శ‌కుడు. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో ఈ ద‌ర్శ‌కుడు సంక్రాంతి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. అందులో మ‌హేశ్ బాబు క్యారెక్ట‌ర్ కు అజ‌య్ కృష్ణ అంటూ పేరు పెట్టారు. మ‌హేశ్ సినిమాల్లో.. అజ‌య్ అనే పేరు కొన‌సాగుతూ వ‌స్తోంది. ఇది వ‌ర‌కూ కొన్ని సినిమాల్లో మ‌హేశ్ కు ఆ పేరే పెట్టారు. అలా హిట్ సెంటిమెంట్ మేర‌కే స‌రిలేరులో అత‌డికి ఆ పేరు పెట్టారేమో కానీ, ఇప్పుడు అదే పేరును త‌న త‌న‌యుడికి కూడా పెట్టుకున్నాడ‌ట అనిల్ రావి పూడి.

స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా ఆడియో విడుద‌ల రోజునే అనిల్ కు కొడుకు పుట్టాడ‌ట‌. ఆ సినిమాలో మేజ‌ర్ అజ‌య్ కృష్ణ గొప్ప ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాడ‌ని, లాయ‌ల్టీ-డిసిప్లేన్- క‌రేజ్ క‌లిగి ఉండ‌టంతో పాటు మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డంలో గొప్ప గుణాన్ని క‌లిగి ఉంటాడ‌ని… అందుకే అజ‌య్ కృష్ణ పేరును త‌న త‌న‌యుడికి పెట్టుకున్న‌ట్టుగా చెబుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

రోజా ఆవకాయ.. చూస్తేనే నోరూరుతుంది