న‌య‌న‌తార ల‌వ్ ఫెయిల్యూర్ పాఠాలు

స‌క్సెస్ కంటే ఫెయిల్యూరే జీవితంలో అనేక పాఠాలు నేర్పుతుంది. మ‌న‌ల్ని నిజంగా ప్రేమిచే వాళ్లెవ‌రో ఒక్క ఫెయిల్యూర్ మాత్ర‌మే చెబుతుంది. పేరుకు త‌గ్గ‌ట్టుగానే అందాల తార న‌య‌న‌తార‌. బ‌హుశా ప్రేమ గాసిప్స్‌కు సంబంధించి న‌య‌న‌తార‌పై…

స‌క్సెస్ కంటే ఫెయిల్యూరే జీవితంలో అనేక పాఠాలు నేర్పుతుంది. మ‌న‌ల్ని నిజంగా ప్రేమిచే వాళ్లెవ‌రో ఒక్క ఫెయిల్యూర్ మాత్ర‌మే చెబుతుంది. పేరుకు త‌గ్గ‌ట్టుగానే అందాల తార న‌య‌న‌తార‌. బ‌హుశా ప్రేమ గాసిప్స్‌కు సంబంధించి న‌య‌న‌తార‌పై వ‌చ్చిన‌న్ని వార్త‌లు మ‌రే హీరోయిన్‌పై రాలేదంటే అతిశ‌యోక్తి కాదు. మూడు ప‌దుల వ‌య‌స్సులోనూ 18 ఏళ్ల పిల్ల‌లా కుర్ర‌కారును మ‌త్తెక్కించే అందాన్ని న‌య‌న‌తార సొంతం చేసుకొంది.

సంప్ర‌దాయ చీర‌క‌ట్టులోనూ, పాశ్చాత్య డ్రెస్ కోడ్ బికినీలోనూ అందాన్ని ఆర‌బోస్తూ అల‌రించ‌డం న‌య‌న‌తార‌కే చెల్లింది. అయితే సినీ ఇండ‌స్ట్రీ అంటే రాజీప‌డ‌టం అని వింటూ ఉంటాం. కానీ ఎవ‌రి కోస‌మో త‌న న‌మ్మ‌కాల‌ను, సిద్ధాంతాల‌ను మార్చుకోన‌ని తెగేసి చెబుతున్న న‌య‌న‌తార త‌న ల‌వ్ ఫెయిల్యూర్ గురించి నోరు విప్పారు.

‘నమ్మకం లేని చోట ప్రేమ నిలవదు. రెండుసార్లు నా ప్రేమ విఫలం కావడానికి కారణం అదే. నమ్మకం లేకుండా కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మంచిదని వారితో నా బంధాన్ని వదులుకున్నాను. ఆ సమయంలో నేను ఎంత బాధను అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధ నుంచి బయటకు రావడానికి నాకు చాలా కాలమే పట్టింది. సినిమాలే నన్ను తిరిగి మనిషిని చేశాయి. నా అభిమానులు ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు’ అని నయనతార త‌న ఆవేద‌న‌ను వ్య‌క్త‌ప‌రిచింది.

సినీ రంగంలోకి అడుగు పెట్టిన మొద‌టి రోజుల్లో శింబుతో న‌య‌న‌తార ప్రేమ వ్య‌వ‌హారం కొన‌సాగించింది. ఇద్ద‌రూ చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగారు. కార‌ణాలేంటో తెలియ‌దు కానీ, శింబుతో వ్య‌వ‌హారం చెడింది. ఆ త‌ర్వాత ప్ర‌భుదేవాతో న‌య‌న‌తార పీక‌ల్లోతు ప్రేమ‌లో కూరుకుపోయింది. ఇద్ద‌రూ స‌హ‌జీవ‌నం కూడా చేశారు. పెళ్లి చేసుకుంటార‌ని అంతా భావించారు. కానీ  ప్ర‌భుదేవాతో కూడా ప్రేమ బెడిసి కొట్టింది. విఫ‌ల ప్రేమ‌కు న‌య‌న‌తార జీవిత‌మే నిద‌ర్శ‌నం.

కాగా ఆ ఇద్ద‌రితో ప్రేమ విఫ‌లం కావ‌డానికి న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మే అని తాజాగా ఆమె ప్రేమ విఫ‌ల పాఠాలు చెబుతోంది. తిరిగి ల‌వ్ ఫెయిల్యూర్ నుంచి కోలుకుని మ‌నిషి కావ‌డానికి సినిమాలే దోహ‌దం చేశాయని న‌య‌న‌తార చెప్పుకొచ్చింది. 

రోజా ఆవకాయ.. చూస్తేనే నోరూరుతుంది