సమ్మర్ సినిమాలు లైన్లో వుండాల్సిందే

కరోనా కారణంగా సినిమాల విడుదలలు ఆగిపోయాయి. థియేటర్లు మూత పడ్డాయి. ఇప్పుడు ఏమిటి పరిస్థితి. ఏ సినిమా ఎప్పుడు వస్తుంది? ఈ విషయంలో నిర్మాతలు అంతా ఏకతాటి పైకి వచ్చి, ఓ పద్దతి ప్లాన్…

కరోనా కారణంగా సినిమాల విడుదలలు ఆగిపోయాయి. థియేటర్లు మూత పడ్డాయి. ఇప్పుడు ఏమిటి పరిస్థితి. ఏ సినిమా ఎప్పుడు వస్తుంది? ఈ విషయంలో నిర్మాతలు అంతా ఏకతాటి పైకి వచ్చి, ఓ పద్దతి ప్లాన్ చేసే వ్యవహారం వుండేలా కనిపిస్తోంది. ఎందకంటే చాలా సినిమాలు మార్చి, ఏప్రియల్, మే, జూన్ నెలల్లో విడుదలకు ప్లాన్ చేసుకున్నాయి. కానీ ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే జూన్ ఫస్ట్ వరకు థియేటర్ల తలుపులు తెరుచుకునే పరిస్థితి లేదు. మరి ఈ సినిమాలు అన్నీ ఎప్పుడు విడుదల కావాలి?

ఇప్పటికే ప్రకటించిన విడుదల డేట్ ల ప్రకారం అదే విదంగా వెనక్క జరపాలన్న ఆలోచనలు సాగుతునట్లు తెలుస్తోంది. అంటే మార్చిలో విడుదల కావాల్సిన సినిమా జూన్ లో విడుదల కావడానికి అవకాశం వుంటుంది. ఏప్రియల్ లో రావాల్సిన సినిమాలు జూన్ లో వస్తాయన్నమాట. కానీ ఇక్కడ ఓ సమస్య  వుంది. జూన్ నుంచి స్కూళ్ల సీజన్ మొదలవుతుంది. అలాగే థియేటర్లకు జనం వస్తారో రారో అన్న అనుమానాలు వున్నాయి. 

వెల్లువగా రావోచ్చు. అస్సలు రాకపోవచ్చు. అందువల్ల ముందుగా రావాల్సిన సినిమాలు ముందుగా విడుదల చేయడానికి కూడా జంకే అవకాశం వుంది.  అందువల్ల మొత్తం మీద ఈ సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమాలు, ఆ లైన్ లో వచ్చే సినిమాలు అన్నీ కలిసి దసరా సీజన్ దాటేసే అవకాశం వుంది. వకీల్ సాబ్ లాంటి పెద్ద సినిమా మాత్రమే దసరా సీజన్ ను అందుకునే అవకాశం వుంది. 

మొత్తం మీద చూసుకుంటే ఏడాదికి 120 నుంచి 150 వరకు సినిమాలు విడుదల చేసే టాలీవుడ్ నుంచి ఈ ఏడాది అన్ని సినిమాలు రాకపోవచ్చు. పైగా సినిమాలు ఇప్పటికే మార్కెట్ అయిపోయినా లెక్కలు అన్నీ మళ్లీ మొదటికి వస్తాయని టాక్ వినిపిస్తోంది. అందువల్ల కూడా విడుదల విషయాలు అన్నీ చాలా కిందా మీదా అయ్యే అవకాశం వుంది. 

మే తరువాత ఏం జరుగుతుంది అన్నది క్లారిటీ లేదు. అందుకే ఇప్పటికి టాలీవుడ్ జనాలు అంతా మౌనంగా వున్నారు. కానీ సినిమాలు రెడీ అయినవి, రెడీ అవుతున్నవి చేతిలో వున్న నిర్మాతల అందరి సమస్య ఒక్కటే. ఫైనాన్స్ కు వడ్డీలు కట్టుకోవడం.

ఈ విషయంలో కూడా నిర్మాతలు, చాంబర్ అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకోవాల్సి వుందని అంటున్నారు. వడ్డీల విషయంలో ఫైనాన్షియర్లతో మాట్లాడానికి రంగం సిద్దం అవుతున్నట్లు బోగట్టా.

రోజా ఆవకాయ.. చూస్తేనే నోరూరుతుంది