Advertisement

Advertisement


Home > Politics - Gossip

కలవరపడుతున్న కమ్మోళ్లు !

కలవరపడుతున్న కమ్మోళ్లు !

తెలుగునాట రాజకీయాలు దాదాపు నాలుగు దశాబ్దాల కాలం నాడే కులం టర్నింగ్ ఇచ్చుకున్నాయి. తెలుగు నాట కుల రాజకీయాలు ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేయడానికి ముందు, చేసిన తరువాత అని మార్క్ చేసుకోవాల్సిందే. అలా అని ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేయడానికి ముందు కుల రాజకీయాలు లేవు అని కాదు. కానీ ఇంత బాహాటంగా గుడ్డలు విప్పి తిరిగేంత అయితే కాదు.

ఎన్టీఆర్ చాలా తెలివిగా కనపడనంతగా తన పార్టీని తన కులం కోసం వాడారు. అది మరి ఆయన చేసిన పనో, ఆ రోజుల్లో, పార్టీ పెట్టిన కొత్తల్లో ఆయన ను గైడ్ చేసిన మీడియా పనో తెలియదు. మొత్తానికి కమ్మ కులాన్ని రాష్ట్రం అంతటా వ్యాప్తి చెందేలా స్కెచ్ వేసారు. శ్రీకాకుళం జిల్లా బోర్డరు ఇచ్చాపురం, విజయనగరం జిల్లా చీపురుపల్లి లాంటి చోట్ల కూడా ఓక్కో కమ్మ ఎమ్మెల్యే వుండేలా జాగ్రత్త పడ్డారు. అప్పటికి ఇంకా ఉత్తరాంధ్రకు ఈ సామాజిక వర్గం ఇంతలా పాకేయలేదు.  అలా ప్రారంభమైన కుల రాజకీయాలు ఇప్పడు పీక్స్ కు చేరుకున్నాయి.

1983 నుంచి 2020 కి మొత్తం చూసుకుంటే 37 ఏళ్లు. ఈకాలంలో మొత్తం మీద తెలుగుదేశం అధికారంలో వున్నది ఇరవై ఏళ్లకు పైనే. కానీ కమ్మ సామాజిక వర్గం ఏమైనా ఇబ్బందికి గురయింది అంటే అది ఈ ఏడాది కాలంలో మాత్రమే. తెలుగుదేశం మధ్యలో పరాజయం పొందినపుడు కానీ, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో కానీ, ఆఖరికి వైఎస్ హయాంలో కానీ అస్సలు ఇబ్బంది పడిన దాఖలా లేదు. వైఎస్ హయాంలో కూడా లగడపాటి,  నిమ్మగడ్డ ప్రసాద్, నవయుగ, పివిపి, కోనేరు ప్రసాద్, ఇలా చాలా మంది కమ్మవారే లబ్ది పొందారు. 

కానీ ఎప్పడయితే జగన్ జైలుకు వెళ్లాడో అప్పుడు జ్ఞానోదయం అయిందని బోగట్టా. ఈ లబ్ది పొందిన వారు ఎవ్వరూ తనను కనీసం పట్టించుకోలేదన్నది జగన్ కి అర్థం అయింది. పైగా ఆ సామాజిక వర్గానికి చెందిన మీడియా తనను ఆది నుంచీ వెంటాడుతూ వస్తోంది. వైఎస్ వున్న దగ్గర నుంచి జగన్ జైలుకు వెళ్లే వరకు ఈ మీడీయా చేయని ప్రయత్నం లేదు.  దాంతో దాదాపుగా ఆ సామాజిక వర్గాన్ని జగన్ దూరం పెట్టడం ప్రారంభించారు. మొత్తం మీద అధికారం సాధించారు.

గేమ్ స్టార్ట్ నౌ

దాంతో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి ఇబ్బందుల స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వున్నా ఆ వర్గం హవా నడించింది. నడుస్తూ వస్తోంది. కానీ తొలిసారి పూర్తిగా చుక్క ఎదురయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారం లేకపోవడం, తెలంగాణలో తమ సామాజిక వర్గ పార్టీ పూర్తిగా కనుమరుగైపోవడం, ఆంధ్రలో తాము నమ్ముకున్న అమరావతి అంథకారంలో మునిగిపోవడం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఈ వర్గానికి చెందిన వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఎక్కడివక్కడ ఆగిపోవడం. విజయవాడ, విశాఖ ల్లాంటి చోట్ల ఈ వర్గానికి చెందిన హోటల్ ఇండస్ట్రీ నడవలేని పరిస్థితి చేరుకోవడం, (గతంలో వీళ్ల కోసం చంద్రబాము ఎక్కడ లేని మీటింగ్ లు నిర్వహించి కోట్ల బిల్లులు చెల్లించారని టాక్), ఇదే సామాజిక వర్గానికి అస్సలు ప్రభుత్వ కాంట్రాక్టులు లభ్యం కాకపోవడం, ఇలా ఒకటేమిటి అష్ట దిగ్బంధనం అయిపోయింది. 

ఇదే సమయంలో ప్రభుత్వ పదవులు, ఉద్యోగాల విషయంలో కూడా ప్రాధాన్యతా క్రమాలు మారాయి. తెలుగుదేశం హయాంలో మెజారిటీ పదవులు, కీలక ఉద్యోగాలు అన్నీ తన హస్తగతం చేసుకున్న వర్గం ఇప్పుడు వెనుక బెంచీలో కూర్చోవాల్సి వచ్చింది. నిజానికి ఇదంతా మిగిలిన సామాజిక వర్గాలకు చాలా హ్యాపీగానే వుంది. కేవలం ఒక్క సామాజిక వర్గం వల్ల అనేక సామాజిక వర్గాల జనాలు ప్రయారిటీ లభించక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ వర్గాలు అన్నీ ప్రయోజనం పొందకపోయినా, గతం గుర్తుకు వచ్చి, భలే గా వుందిగా అనే ఫీలింగ్ ను ఎక్స్ ప్రెస్ చేసే పరిస్థితి వచ్చింది.

ఇలాంటి టైమ్ లో కరోనా వచ్చింది. ఇది మరింత అతలా కుతలం చేసేసింది. సహజంగా వ్యాపారాలను నమ్ముకున్న కమ్మ సామాజిక వర్గం ఇఫ్పుడు మరింత ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్, హోటల్, సినిమా, మీడియా, ఆటో మొబైల్ రంగాలు అన్నీ ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థితి కనిపిస్తోంది. రెవెన్యూలు కూలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

ఇదే డిస్కషన్

ఇటీవల కొందరు కీలక కమ్మ సామాజిక వర్గ జనాలు ఓ దగ్గర చేరారు. జస్ట్ క్యాజువల్ గా. వీరంత ఆ సమయంలో ఓ కాంగ్రెస్ నేతకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియచేయడానికి వాట్సాప్ లో గ్రూప్ చాటింగ్ చేసినట్లు బోగట్టా. కాంగ్రెస్ నెత కేవిపి రామచంద్రరావు రాజ్య సభ సభత్వం  పూర్తి అయిపోతున్న నేపధ్యంలో ఆయనకు వీరంతా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపినట్లు బోగట్టా.

వీరిలో వేలకోట్ల రుణాలు బ్యాంకుల్లో వుండి, కంపెనీని వదిలేసుకున్న ఓ కాంగ్రెస్ చిలక జోస్యం నాయకుడు, ఒకప్పుడు జగన్ ఎంతో ఇష్టపడినా, ఇప్పుడు అస్సలు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని ఓ విజువల్ మీడియా అధినేత, ఓ సినిమా నిర్మాత, ఇంకా మరి కొంత మంది వున్నట్లు బోగట్టా. 

వీరందరి మధ్య ఒకటే డిస్కషన్ నడిచిందని తెలుస్తోంది. మళ్లీ మన సామాజిక వర్గానికి ప్రాభవం ఎప్పుడు వస్తుంది. అసలే జగన్ పాలన అనుకుంటే ఇప్పుడు కరోనా విరుచుకుపడింది. వ్యాపారాలు కుదేలయిపోతున్నాయి. ఇలా అయితే పరిస్థితి ఎలా? ఎప్పుడు మారుతుంది. జగన్ ను తట్టుకుని అయిదేళ్లు ఎలా మనగలగుతుంది తమ సామాజిక వర్గం అని వీళ్లంతా డిస్కస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద కమ్మ సామాజిక వర్గంలో కలవరం అయితే కాస్త ఎక్కువే వుంది. సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకుని జగన్ పాలనను జనంలో ఎండగడ్డాలన్న తపన ఆ వర్గంలో కనిపిస్తోందని బోగట్టా. 

విషయం ఏమిటంటే తెలుగుదేశం స్థాపన నాటి నుంచి చూసుకుంటే ఈ ఒక్క ఏడాది మాత్రమే ఈ వర్గం ఆటలు సాగలేదు. 37 ఏళ్లలో 36 ఏళ్లు ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. ఒక్క ఏడాది సాగకపోయేసరికి గిలగిల అన్నట్లు అయిపోతోంది పరిస్థతి.

రోజా ఆవకాయ.. చూస్తేనే నోరూరుతుంది

మరో రెండు వారాలు ఎక్కడివాళ్ళు అక్కడే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?