మొత్తానికి అయ్యప్పన్ కోషియమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం అన్నది ఫిక్స్ అయిపోయింది. స్టార్ కాస్ట్ అన్నది తరువాత ముందు మలయాళ నిర్మాతలతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు బేరం అయితే కుదిరిపోయింది. అడ్వాన్స్ గా కొంత మొత్తం కూడా ఇచ్చేసారు. కోటి అయిదు లక్షలకు రీమేక్ రైట్స్ బేరం కుదిరింది. ఇప్పుడు అదనంగా హిందీ లో రీమేక్ రైట్స్ కోసం బేరాలు సాగుతున్నాయి.
బాలకృష్ణ-రానా కాంబినేషన్ లో రీమేక్ చేయాలన్నది ఐడియా. కానీ ఇది ప్రాధమికంగా మాత్రమే. ఎవరు ఊ అంటారు? ఎవరితో చేయాల్సి వస్తుంది? అసలు ఆ సినిమాకు సరైన మార్పులు చేయగల, సోల్ చెడకుండా తెలుగులోకి అనువదించగల డైరక్టర్ ఎవరు? ఎవరు అన్నది కీలకంగా వుంటుంది.
సితార ఆస్థానంలో సుధీర్ వర్మ, గౌతమ్ తిన్ననూరి లాంటి వాళ్లు వున్నారు. మరి ఎవరి చేతిలోకి ఈ ప్రాజెక్టు వస్తుందో? ఎవరు చేస్తారో అన్నది ఇప్పట్లో తేలేది కాదు. కరోనా కల్లోలం ముగిసిన తరువాతే అన్ని విషయాలు ఫైనల్ అవుతాయి.