పవన్‌తో నటించే అవకాశం వచ్చిందంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఎందుకంటే పవన్‌కున్న ఫాలోయింగ్ అలాంటిది. రాజకీయాల్లో పవన్ బిజీ అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక తానెప్పుడూ సినిమాలు తీసేది లేదని భీష్మ ప్రతిజ్ఞ కూడా చేశాడు. అయితే ఆయన అభిప్రాయాన్ని మార్చుకుని ఓ శుభ ముహూర్తాన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’లో నటించేందుకు అంగీకరించాడు. ఆ తర్వాత మరో నాలుగైదు సినిమాలు కూడా రెడీ అయ్యాయి.
తమన్ సంగీతం అందిస్తున్న ‘వకీల్ సాబ్’కు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. అలాగే ఈ సినిమాలో ‘మగువా మగువా’ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. రెండేళ్ల తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’పై సినీ ఇండస్ట్రీలో అంచనాలు బాగా పెరుగుతున్నాయి.
అయితే ఈ సినిమాకు సంబంధించి నటీనటులపై రకరకాల ప్రచారం జరుగుతోంది. తాజాగా అందాల భామ శృతిహాసన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో తెగ ప్రచారమవుతోంది. ఇప్పటికే అంజలి, నివేదా థామస్‌లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు మరో ముఖ్య పాత్ర కోసం పవన్‌తో శృతి కలవనుందని టాక్ వినవస్తోంది. దీనికి ప్రత్యేక కారణం కూడా లేకపోలేదు. గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రంలో పవన్, శృతిహాసన్‌ల కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. దీంతో ‘వకీల్ సాబ్’ కోసం దర్శకనిర్మాతలు ఈ అందాల తారను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. అయితే దీనిపై శృతి క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం తెలుగులో క్రాక్ చిత్రంలో మినహా మరే సినిమాలో నటించడం లేదని శృతి స్పష్టం చేసింది. అంతేకాదు ఏ రీమేక్ చిత్రంలో నటించడం లేదని ఆమె చెప్పింది. సినిమా కోసం తనెనవరూ సంప్రదించలేదని కూడా శృతి హాసన్ తేల్చిచెప్పడంతో సోషల్ మీడియాలో ప్రచారానికి తెరపడింది.