ఆ రైటర్ చుట్టుపక్కల కనిపిస్తే…!

ఒక్కోసారి అంతే… ఒక్కొక్కరి ఫేస్ చూస్తే చిర్రెత్తుకు వస్తుంది. దానికి రీజన్ వుండదు. కానీ ఇలాంటి చిర్రెత్తుకు రావడానికి రీజన్ కూడా దొరికితే ఇక చెప్పక్కరలేదు. ఆ మనిషిని కిలోమీటర్ దూరం పెట్టాల్సిందే.  Advertisement…

ఒక్కోసారి అంతే… ఒక్కొక్కరి ఫేస్ చూస్తే చిర్రెత్తుకు వస్తుంది. దానికి రీజన్ వుండదు. కానీ ఇలాంటి చిర్రెత్తుకు రావడానికి రీజన్ కూడా దొరికితే ఇక చెప్పక్కరలేదు. ఆ మనిషిని కిలోమీటర్ దూరం పెట్టాల్సిందే. 

టాలీవుడ్ లో ఓ సీనియర్ రైటర్ ను ఓ సీనియర్ హీరో ఇలాగే కిలో మీటర్ దూరం పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదో విధంగా సినిమాలు సెట్ చేయడం లేదా, సలహాలు, సూచనలు, కథా విస్తరణలు పేరిట ప్రాజెక్టుల్లోకి చేరి కాలక్షేపం చేయడం కామన్ ఆ రైటర్ కు. 

ప్రస్తుతం ఓ దర్శకుడికి మెంటార్‌నో లేదా తెర వెనుక అన్నీ తానే అన్న టైపులోనో వున్నారు. ఆ మధ్య ఆ దర్శకుడు చేసిన సినిమాకు ఈ రైటర్ చేయి కాలు అన్నీ చేసుకున్నారు.

కట్ చేస్తే, అదే దర్శకుడికి మరో సీనియర్ హీరోతో సినిమా చాన్స్ వచ్చింది. ఇతగాడి దగ్గర సరైన ఐడియాలు లేవు. ఆ రైటర్ చెప్పిన పాతకాలం ఐడియాను, పీరియాడిక్ కథ అనే టైపులో చెప్పి ఓ మేరకు ఒప్పించారు. కానీ ఇప్పుడు ఆ సీనియర్ హీరో ఆ కథ వద్దని చెప్పేసారట. అంతే కాదు, ఆ కథ ఐడియా ఫలానా రైటర్ అది అని, ఆ రైటర్ ఈ దర్శకుడి పక్కనే వుంటున్నాడని తెలిసి, కాస్త కోప్పడినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టులో ఆ రైటర్ వున్నట్లు తెలిసినా, ఈ ప్రాజెక్ట్ దరిదాపుల్లోకి ఆ రైటర్ వచ్చినా సినిమా చేసేది లేదని డైరక్టర్ కు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సోలోగా కథ తయారు చేయలేక ఆ దర్శకుడు హీరో ఇచ్చిన ఇన్ పుట్ లతో హోమ్ వర్క్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.