బాబు, లోకేశ్ క‌లిసి లేరా?

ఏపీ మంత్రి కొడాలి నాని ఓ కొత్త , సంచ‌ల‌న విష‌యాన్ని చెప్పారు. టీడీపీ యువ‌కిశోరం లోకేశ్‌పై విరుచుకుప‌డే క్ర‌మంలో కొడాలి నాని చెప్పిన విష‌యాలు మ‌రీ ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్ని అయోమ‌య్యానికి గురి…

ఏపీ మంత్రి కొడాలి నాని ఓ కొత్త , సంచ‌ల‌న విష‌యాన్ని చెప్పారు. టీడీపీ యువ‌కిశోరం లోకేశ్‌పై విరుచుకుప‌డే క్ర‌మంలో కొడాలి నాని చెప్పిన విష‌యాలు మ‌రీ ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్ని అయోమ‌య్యానికి గురి చేస్తున్నాయి. 

తండ్రీత‌న‌యులైన చంద్ర‌బాబు, లోకేశ్ హైద‌రాబాద్‌లో క‌లిసి లేర‌ని కొడాలి నాని ప్ర‌క‌టించ‌డం టీడీపీ శ్రేణుల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. ఇది నిజ‌మా? అంటూ అగ్ర‌నేత ల‌ను కొంద‌రు ద్వితీయ శ్రేణి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆరా తీయ‌డం స్టార్ట్ చేశారు.

నిన్న క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై నారా లోకేశ్ చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత‌లు ఫైర్ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొడాలి నాని శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ లోకేశ్‌, చంద్ర‌బాబుల‌పై ఓ రేంజ్‌లో ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. మీడియాతో నాని ఏమ‌న్నారో ఆయ‌న మాటల్లోనే…

“ఇప్పుడు నిన్ను(లోకేశ్‌) ఇంట్లో నుంచి మీ నాన్న ఎందుకు బ‌య‌టికి పంపించాడు? చంద్ర‌బాబు నాయుడు జూబ్లిహిల్స్‌లో ఉంటున్నాడు. ఫామ్‌హౌస్‌లో ఎందుకు పెట్టాడు నిన్ను? ఆయ‌న‌కు తెలుసు.

దేంతో తిరిగేవాడు దాంతోనే పోతాడ‌ని. నేను మామకి వెన‌కాల తిరిగి వెన్నుపోటు పొడిస్తే … నా కొడుకు తండ్రికే పొడిచేసేట్టున్నాడ‌ని చెప్పి నిన్ను ఇంట్లో నుంచి బ‌య‌టికి పంపించి ఫామ్‌హౌస్‌లో పెట్టింది వాస్త‌వం కాదా?  

నీ చ‌రిత్ర‌, నీ బాబు చ‌రిత్ర‌, ఆయ‌న‌ బాబు క‌ర్జూర‌పునాయుడి చ‌రిత్ర , ఆయ‌న‌ బాబు కిస్మిస్ నాయుడి చ‌రిత్ర ఇవ‌న్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. నువ్వు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని అరేయ్ ఒరేయ్ అని వాగావంటే…నువ్వు ఎక్క‌డైనా దొర‌క‌వ‌ని అనుకుంటున్నావామో. మా ఎమ్మెల్సీలు నీకు బ‌డిత పూజ మండ‌లిలో చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు” అని తీవ్ర‌స్థాయిలో నాని హెచ్చ‌రించారు.

తండ్రీత‌న‌యుల‌పై కొడాలి నాని విమ‌ర్శ‌లు ఎప్పుడూ ఉండేవే. అయితే ఈ సారి మాత్రం లోకేశ్‌ను చంద్ర‌బాబు ఫామ్‌హౌస్‌లో పెట్టార‌నే సంచ‌ల‌న విష‌యాన్ని ఇప్పుడే చెప్పారు. అంతేకాదు, ఫామ్‌హౌస్‌లో పెట్టింది వాస్త‌వ‌మా?  కాదా? అని కొడాలి నాని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. 

తండ్రీత‌న‌యుల‌పై కొడాలి నాని తిట్ల కంటే, వాళ్లిద్ద‌రూ హైద‌రాబాద్‌లో ఒకే ఇంట్లో లేర‌నే సంచ‌ల‌న ఆరోప‌ణ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిమిషాల్లోనే వ్యాపించింది. ముఖ్యంగా తండ్రీత‌న‌యులు క‌లిసి లేర‌నే అంశంపై టీడీపీ శ్రేణులు చ‌ర్చించుకోవ‌డం విశేషం.