Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆర్ఆర్ఆర్ లో అతి పెద్ద సాంగ్

ఆర్ఆర్ఆర్ లో అతి పెద్ద సాంగ్

రాజమౌళి..ఎన్టీఆర్..చరణ్ ల కాంబినేషన్ లో తయారవుతున్న ఆర్ఆర్ఆర్ లో పెద్ద సాంగ్ ఒకటి పిక్చరైజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

సుమారు ఎనిమిది నిమషాల పాట ఇది. పాట మొత్తం గ్రాఫిక్స్ లో చిత్రీకరించాల్సి వుంది. ఆపై విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తారు.

ఇద్దరు హీరోలు చరణ్, ఎన్టీఆర్ ల మీద ఈ పాటను చిత్రీకరించడానికే కనీసం ఇరవై రోజులు పడుతుందని యూనిట్ వర్గాల బోగట్టా. ఆపైన విఎఫ్ఎక్స్ వర్క్ చేసి పాటను తయారు చేయాల్సి వుంటుంది. 

రాజమౌళి మదిలో వున్న విజువల్స్ ను స్టోరీ బోర్ట్ రూపంలో ఆర్టిస్టుల చేత తయారుచేయించారు. దాన్ని విఎఫ్ఎక్స్ నిపుణులు విజువలైజ్ చేయాల్సి వుంటుంది. వాస్తవానికి ఈ అక్టోబర్ లో విడుదల కావాల్సి వుంది. 

ఎలాగైనా అక్టోబర్ లో విడుదల చేస్తామని బయ్యర్లకు చెబుతున్నారని వార్తలు వినవస్తున్నాయి. కానీ అలా జరగదు, సంక్రాంతి లేదా సమ్మర్ కే అని రాజమౌళికి తెలుసు అని, ఆ మేరకు హీరోలకు క్లారిటీ ఇచ్చారని గ్యాసిప్ లు కూడా వున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?