యువి క్రియేషన్స్ ఓ సినిమా కంపెనీ మాత్రమే కాదు. వాళ్లకు రిలేషన్లు, ఫ్రెండ్ షిప్ లు, మొహమాటలు ఇలా చాలా వున్నాయి. వ్యాపారం కన్నా ఇవే కీలకం వాళ్లకు,. అందుకే సుజిత్ లాంటి బడ్డీ డైరక్టర్ ను తీసుకువచ్చి, వందలకోట్ల ప్రాజెక్టును, బాహుబలి లాంటి హీరోను అతని చేతిలో పెట్టారు. యువి వాళ్లు తప్ప అందరూ అనుమాన పడినట్లే, జరిగింది. సాహో పరాజయానికి డైరక్టర్ సుజిత్ అనుభవ రాహిత్యమే అన్నది స్పష్టంగా కనిపించింది.
అయినా కూడా యువి మాత్రం సుజిత్ పట్ల అభిమానం వన్ పర్సంట్ కూడా తగ్గించుకోలేదు. సుజిత్ యువి ఆఫీసుకు వచ్చి, తన స్క్రిప్ట్ పనులు తాను చేసుకుంటూనే వున్నారు. అక్కడతో ఆగలేదు కథ. ఎలాగైనా సుజిత్ కు మరో సినిమా రావాలని యువి ప్రయత్నాలు చేస్తున్నట్లు బోగట్టా.
యువి కి చెందిన విక్రమ్ కి హీరో రామ్ చరణ్ స్కూలు డేస్ నాటి దోస్త్. అందుకే అక్కడయినా సుజిత్ కు సినిమా రప్పించాలని ప్రయత్నాలు ప్రారంభమైనట్లు బోగట్టా. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో చాలా సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి. వాటిలో నిర్మాత ఎన్వీ ప్రసాద్ భాగస్వామ్యంలోని లూసిఫర్ రీమేక్ ఒకటి. దీనికోసం చాలా డైరక్టర్ల పేర్లు పరిశీలనలో వున్నాయి. ఆ జాబితాలో బాబీ పేరు వుంది. ఇంకా మరికొంత మంది పేర్లు వున్నాయి.
ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సుజిత్ ను తీసుకోవాలని చరణ్ మీద వత్తిడి పెరుతోందని బోగట్టా. సుజిత్ కోసం రెండు మూడు మార్గాల నుంచి చరణ్ మీద వత్తిడి వస్తోందని తెలుస్తోంది. వాటిలో యువి విక్రమ్ వైపు నుంచి కూడా ఒకటి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ బాబీ కే చాన్స్ ఎక్కువగా వుందని తెలుస్తోంది. లూసిఫర్ కు కనుక సుజిత్ కు అవకాశం ఇస్తే, రామ్ చరణ్ మరోసారి తప్పులో కాలేసినట్లే అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే లూసిఫర్ లాంటి సబ్జెక్ట్ కు ఎమోషన్లు పండించడం, ఎలివేషన్లు చూపించడం వంటి కీలక టాలెంట్ అవసరం అని, సాహోలో ఈ రెండు విషయాల్లో సుజిత్ విఫలమయ్యాడని టాక్ వినిపిస్తోంది.