వైసీపీ క్లీన్ స్వీప్… టీడీపీకి మళ్ళీ…

మహా విశాఖ నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తానికి మొత్తం పది కమిటీలను గెలిచి సత్తా చాటింది. వరసగా రెండవ ఏడాది జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ…

మహా విశాఖ నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తానికి మొత్తం పది కమిటీలను గెలిచి సత్తా చాటింది. వరసగా రెండవ ఏడాది జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగితే టీడీపీ పది స్థానాలకు పోటీ చేసింది. తొమ్మిది స్థానాలలో తన అభ్యర్ధులను తెలుగుదేశం నిలబెట్టింది.

జీవీఎంసీలో మొత్తం బలం వైసీపీకి ఉంది. కానీ క్రాస్ ఓటింగ్ మీద టీడీపీ ఆశలు పెట్టుకుని అభ్యర్ధులను రంగంలో ఉంచింది. అయితే టాప్ లెవెల్ లో టెన్ కి టెన్ ర్యాంక్ ని సాధించి ఫ్యాన్ గిర్రున యమ స్పీడ్ గా తిరిగేసింది.

వైసీపీలో అసంతృప్తి ఏమైనా ఉంటే సొమ్ము చేసుకుందామని చూసిన టీడీపీ ఖంగు తింది. పైగా టీడీపీ నుంచే కొన్ని ఓట్లు వైసీపీకి క్రాస్ అయ్యాయని అంటున్నారు. మొత్తానికి విశాఖ సిటీకి గుండెకాయ లాంటి కార్పోరేషన్ లో వైసీపీ పాగా వేయడమే కాకుండా స్టాండింగ్ కమిటీలను కూడా ద్వీతీయ ఆంటంకం లేకుండా అద్వితీయంగా గెలిచి తన సత్తా చాటింది.

ఈ ఫలితాలు ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపగా టీడీపీ నైరాశ్యంలో మునిగింది. దీంతో అధికార పార్టీలో పండుగ చేసుకుంటున్నారు. టీడీపీ కంచు కోట కాదు మాది విశాఖ అని వైసీపీ నేతలు అంటున్నారు.