మంత్రి గారు తిరిగి చెడ్డారట!

వెనకటికో ముతక సామెత ఉంది. ఆడపిల్ల తిరిగి చెడింది, మగాడు తిరగక చెడిపోయాడన్నది ఆ సామెత. ఇక ప్రజా ప్రతినిధులు తిరగకపోతేనే చెడిపోయినట్లు. వారు ఇంట్లో కూర్చుంటే మీకేం పట్టదా అని పెద్ద గొంతు…

వెనకటికో ముతక సామెత ఉంది. ఆడపిల్ల తిరిగి చెడింది, మగాడు తిరగక చెడిపోయాడన్నది ఆ సామెత. ఇక ప్రజా ప్రతినిధులు తిరగకపోతేనే చెడిపోయినట్లు. వారు ఇంట్లో కూర్చుంటే మీకేం పట్టదా అని పెద్ద గొంతు వేసుకుని అటు  ప్రతిపక్షం, ఇటు  మీడియా కూడా తెగ విరుచుకుపడతాయి.

ఇపుడు లోకానికే  కరోడా లాంటి కరోనా వైరస్ వీర విహారం చేస్తోంది. దాని అంతూ పొంతూ కూడా ఎవరికీ అర్ధం కావడంలేదు. అటువంటి కరోనా వైరస్ విషయంలో జనాలను చైతన్యం చేస్తూ వైసీపీ మంత్రులు ప్రజలకు అండగా ఉంటున్నారు. దీని మీద కూడా టీడీపీ ఘాటు విమర్శలు చేస్తోందనుకోండి, అది వేరే విషయం.

అయితే విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ జనంలో బాగా తిరిగేస్తున్నాడని ఒక విచిత్రమైన  కంప్లైట్. అది కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా ఎవరో  హైకోర్టులో వేశారట. మంత్రి గారు జనంలోనే ఉంటున్నారని, ఆయన్ని అడ్డుకోవాలన్నది ఆ పిల్ ఉద్దేశ్యం. ఆయన సామాజిక దూరం పాటించడంలేదని అందుకే అడ్డుకోవాలని  చెబుతున్నా దాని అర్ధం, పరమార్ధం వేరే ఉందని అంటున్నారు. సామాజిక దూరానికి,  మంత్రి అసలు కదలకూడదు అనడానికి  సంబంధం ఏంటో అర్ధం కాదు.

చూడబోతే  ఇదేదో మంత్రి దూకుడుని కట్టడి చేయడానికే ఫైల్ చేసిన పిటిషన్ గా వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. మా మంత్రులు జనంలో ఉంటే తప్పేంటి. ఏ పనీ చేయకపోతే మీరే అడుగుతారుగా. ఇపుడు జనంలో ఉంటూ వారి మంచి చెడ్డలు చూసే మంత్రి గారి మీద ఫిర్యాదులేంటని గుస్సా అవుతున్నారు. మొత్తానికి మా బాగా  తిరిగి చెడ్డ మంత్రి గా అవంతి  అపోజిషన్ కి కనిపిస్తున్నారేమో.

వర్షంలో మెగాస్టార్ ఇల్లు