వేదాళం Vs భోళాశంకర్.. ఆ ఒక్కటి మిస్ అయింది

ఈ కాలం సినిమాకు ఓ ఊపు రావాలంటే ముందుగా ముందుగా క్లిక్ అవ్వాల్సింది సాంగ్స్. కనీసం ఒక్క పాటైనా వైరల్ అయితే, ఆ సినిమాకొచ్చే మైలేజీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. మూవీలో స్టార్…

ఈ కాలం సినిమాకు ఓ ఊపు రావాలంటే ముందుగా ముందుగా క్లిక్ అవ్వాల్సింది సాంగ్స్. కనీసం ఒక్క పాటైనా వైరల్ అయితే, ఆ సినిమాకొచ్చే మైలేజీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. మూవీలో స్టార్ హీరో ఉన్నప్పటికీ, సాంగ్స్ క్లిక్ అయితే వచ్చే  హైప్ వేరు. ఇప్పుడిదంతా ఎందుకంటే, భోళాశంకర్ సినిమాకు అన్ని హంగులూ ఉన్నాయి కానీ, ఈ ఒక్క 'హైప్' మాత్రం మిస్సయింది.

వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది భోళాశంకర్. ఒరిజినల్ మూవీకి ఓ రేంజ్ లో హైప్ తీసుకొచ్చిన సాంగ్ 'ఆలుమా డోలుమా'. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ అప్పట్లో తెగ వైరల్ అయింది. సినిమా ఎప్పుడొస్తుందా, ఈ సాంగ్ లో అజిత్ ను చూసి తరిద్దామంటూ ఫ్యాన్స్ కళ్లుకాయలుకాచేలా చేసింది ఈ ఒక్క పాట.

అలాంటి ఓ వైరల్ సాంగ్ భోళాశంకర్ లో మిస్సయింది. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. సినిమా నుంచి రిలీజైన జాంజాం జజ్జనక, మిల్కీబ్యూటీ లాంటి సాంగ్స్ బాగానే హిట్టయ్యాయి. కానీ హిట్ అవ్వడానికి, వైరల్ అవ్వడానికి చాలా తేడా ఉంది. ఈ విషయంలో భోళాశంకర్ వెనకబడింది.

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమానే తీసుకుంటే, అందులో స్పెషల్ సాంగ్, రిలీజ్ కు ముందు పెద్ద హిట్టయింది. దసరా, సర్, బేబి లాంటి సినిమాలకు విడుదలకు ముందు క్రేజ్ రావడానికి కారణం, ఆయా సినిమాల నుంచి ఒక్కో సాంగ్ బాగా వైరల్ అవ్వడమే. అలాంటి ఎలిమెంట్ భోళాశంకర్ కు మిస్సయింది.