త్రివిక్రమ్ కు 45 లక్షలు

పెద్ద హీరోలతో పెద్ద దర్శకులకు వున్న అనుబంధం భలే వర్కవుట్ అవుతుంటుంది ఒక్కోసారి. పెద్ద హీరోలకు యాడ్ చేయాల్సి వస్తే, తమతో స్నేహానుబంధం వున్న దర్శకులకు ఆ బాధ్యత అప్పగిస్తారు.  Advertisement జస్ట్ ఓ…

పెద్ద హీరోలతో పెద్ద దర్శకులకు వున్న అనుబంధం భలే వర్కవుట్ అవుతుంటుంది ఒక్కోసారి. పెద్ద హీరోలకు యాడ్ చేయాల్సి వస్తే, తమతో స్నేహానుబంధం వున్న దర్శకులకు ఆ బాధ్యత అప్పగిస్తారు. 

జస్ట్ ఓ పూట..లేదా ఓ రోజు పనికి 40 నుంచి 45 లక్షలు పారితోషికం వస్తుంది. అలా అని తమ సృజనాత్మకత అంతా వాడేస్తారు అంటే పొరపాటే.

ఇదెలా వుంటుంది అంటే ఏదైనా కంపెనీ హీరోతో యాడ్ చేయాలనుకున్నపుడు ముందుగా ఒప్పందానికి వస్తాయి. తరువాత తమ తమ క్రియేటివ్ కన్సల్టెంట్ లతో యాడ్ కాన్సెప్ట్ కు రూపకల్పన చేయిస్తాయి. డమ్మా యాడ్ లను తయారు చేయిస్తాయి. అప్పుడు హీరోలకు చూపించి అనుమతి తీసుకుంటాయి. ఆ తరువాత హీరో చెప్పిన దర్శకుడికి చిత్రీకరణ బాధ్యత అప్పగిస్తాయి.

కంపెనీ ఇచ్చిన ప్రకటనను యాజ్ ఇట్ ఈజ్ గా ఈ హీరోతో చేసి జిరాక్స్ తీసి ఇవ్వాల్సిందే. సెంటీ మీటర్ మార్చడానికి వుండదు. కానీ రెమ్యూనిరేషన్ మాత్రం భారీగా వుంటుంది. 

ఈ మధ్యనే హరీష్ శంకర్ కు బన్నీ ద్వారా ఓ చాన్స్ వచ్చింది. ఇప్పుడు త్రివిక్రమ్ కు. గతంలో కూడా త్రివిక్రమ్ ఇలాంటి యాడ్ లు చాలా చేసారు. ఈసారి యాడ్ కు త్రివిక్రమ్ కు అందిన రెమ్యూనిరేషన్ 45 లక్షలు అని తెలుస్తోంది.