మెగాస్టార్ మెగా మూవీ సైరా సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు బకాయి వున్నాయి. సినిమాకు ఇప్పటి వరకు మార్కెట్ స్టార్ట్ కాలేదు. అయితే నైజాం నుంచి మాత్రం బయ్యర్లు ఒక అడుగు ముందుకు వేసి, భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నైజాం ఏరియాకు 25 కోట్లకు పైగా ఆఫర్ ను సైరా నిర్మాత రామ్ చరణ్ ముందు వుంచినట్లు తెలుస్తోంది. హీరో నితిన్ తండ్రి, నైజాంలో ఒకప్పుడు మాంచి డిస్ట్రిబ్యూటర్ గా వున్న సుధాకర్ రెడ్డి ఈ ఆఫర్ ను ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా సుధాకరరెడ్డి సైలెంట్ గా వున్నారు. బయ్యర్ గా కన్నా ప్రొడ్యూసర్ గా కాస్త గట్టిదెబ్బలు తిన్నారు. అయితే ఇటీవల ఆయన, మరికొందరు భాగస్వాములు కలిసి, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ ను గట్టిగా చేయాలని డిసైడ్ అయ్యారు. కాంచన 3ని నైజాంలో పంపిణీ చేసారు. మరికొన్ని సినిమాలు కూడా కొనే ఆలోచనలో వున్నారు.
నైజాంలో కేవలం సునీల్, దిల్ రాజు మాత్రమే బయ్యర్లు కావడంతో మార్కెట్ లో కాంపిటీషన్ లేదని టాక్ వుంది. ఈ నేపథ్యంలో సుధాకర రెడ్డి మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. ఈసారి కేవలం నైజాంలోనే కాకుండా, ఆంధ్రలో కూడా సినిమాలు కొనాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
శంకర్ సినిమా అంటే.. భారీతనం, డిఫరెంట్ టేకింగ్, స్టైలిష్ మేకింగ్