మహర్షికి పంచాయతీ తప్పదా?

మహర్షి సినిమాను ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించారు. ఈ సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణానికి ముందు పేపర్ పై ఓ అంచనా అంటూ వేసుకుంటారు. ఎస్టిమేషన్ బడ్జెట్. దీనిప్రకారం కనీసం ముగ్గురికి మూడు అయిదులు…

మహర్షి సినిమాను ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించారు. ఈ సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణానికి ముందు పేపర్ పై ఓ అంచనా అంటూ వేసుకుంటారు. ఎస్టిమేషన్ బడ్జెట్. దీనిప్రకారం కనీసం ముగ్గురికి మూడు అయిదులు 15 కోట్లు మిగులుతాయని అంచనా వేసారు. కట్ చేస్తే, సినిమా నిర్మాణం మొత్తం దిల్ రాజు చేపట్టారు.

టాలీవుడ్ లో వున్న అలవాటు ప్రకారం ఎవరు నిర్మాణం చేస్తే, వాళ్లే ఖర్చంతా పెట్టుకుంటారు. ఇది కామన్ ప్రాక్టీస్. అయితే తీరా నిర్మాణం అంతా అయిపోయాక, 15 కోట్లు ఓవర్ బడ్జెట్ అయిపోయిందని, అస్సలు మిగులులేదని నిర్మాత దిల్ రాజు మిగిలిన పార్టనర్లకు చెప్పినట్లు బోగట్టా.

అక్కడ ప్రారంభమైంది అసలు తకరారు. దిల్ రాజు మాటలతో మిగిలినవారు ఏకీభవించడం లేదని తెలుస్తోంది. పైగా అశ్వనీదత్, పివిపి కూడా ఎవరి బాధలు వారు చెబుతూ, తాము ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావడం ద్వారా ఎంత లాస్ అయిందీ దిల్ రాజుకు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క పివిపినే ఈ సినిమాకు, భాగస్వామ్యానికి ఓకే చెప్పడం ద్వారా ఆరేడు కోట్లు లాస్ అయిపోయానని అంటున్నట్లు తెలుస్తోంది. 

ఇలాంటి నేపథ్యంలో మహేష్ బాబు ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. ఈ రాత్రికి ప్రీరిలీజ్ ఫంక్షన్ వుంది. రేపటి నుంచి ఇక అసలు కథ మొదలు కావచ్చు. తమకు కనీసం అయిదేసి కోట్లు లాభం రూపేణా ఇవ్వాల్సిందే అనే ఆలోచనలో, డిమాండ్ తో పివిపి, అశ్వనీదత్ వున్నట్లు తెలుస్తోంది.

ఆ మేరకు పంచాయతీలు తప్పవని ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్ల బోగట్టా. అలా ఇవ్వాలి అంటే దిల్ రాజు లెక్క ప్రకారం అయితే ఇంట్లోంచి తెచ్చిఇవ్వాలి. లేదా మహేష్ బాబు తన రెమ్యూనిరేషన్ నుంచి సాయంచేయాలి. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ తన రెమ్యూనిరేషన్ కాస్త తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. అందువల్ల అటు నుంచి ఏ విధమైన సాయం వుండకపోవచ్చు.

మరి ఏం జరుగుతుందో చూడాలి. వారంరోజుల్లో విడుదల వుంది. ఈలోగా ఏదైనా సెటిల్ మెంట్ అయితే జరుగుతుంది. అదేంటీ అన్నదే వేచి చూడాలి.

లీక్ లు ఎక్కడి నుంచి?
మహర్షి లావాదేవీలు, ఇతరత్రా వార్తలు అన్నీ ఎప్పటికప్పుడు బయటకు వస్తుండడంతో నమ్రత కాస్త ఆరా తీసినట్లు తెలుస్తోంది. భాగస్వాముల్లో ఎవరో ఒకరు గ్రేట్ ఆంధ్రకు లీకులు ఇస్తున్నారని అమె తన పీఆర్ టీమ్ గ్రూప్ లో కామెంట్ పెట్టినట్లు వినిపిస్తోంది. కానీ ఇండస్ట్రీలో ఏ విషయమైనా ఎంతోకాలం దాగదు. ఇట్లే బయటకు వచ్చేస్తుంటుంది. పైగా ఓ సినిమా అన్నాక నిర్మాతలే కాదు, ఫైనాన్షియర్లు, బయ్యర్లు, పాత లెక్కల జనాలు ఇలా చాలామంది వుంటారు.

ఆ విషయం గమనించాలి కదా? అంతే కాదు వస్తున్న లీకులు కావచ్చు, వార్తలు కావచ్చు మహేష్ ను టార్గెట్ చేసినవో, ఇబ్బంది పెట్టేవో కాదు, కేవలం ప్రొడక్షన్ అండ్ రిలీజ్ అప్ డేట్ లు మాత్రమేగా.

దేవదాస్ సెటిల్ మెంట్లు
ఇదిలావుంటే భాగస్వాముల్లో ఒకరైన నిర్మాత అశ్వనీదత్ తన దేవదాస్ బకాయిల సెటిల్ మెంట్లు ప్రారంభించారు. నిన్న ఈస్ట్ గోదావరి వ్యవహారం క్లోజ్ చేసారు. కోటికి పైగా ఇవ్వాల్సివుంది. ఆర్థిక పరిస్థితి బాగా లేదని, ఆ పైమొత్తం ఇవ్వలేనని, కోటికి సెటిల్ మెంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అమౌంట్ ట్రాన్స్ ఫర్ కాలేదని, శుక్రవారం నాటికి అవుతుందని ఇండస్ట్రీ సర్కిళ్ల బోగట్టా. ఈరోజు నెల్లూరు బయ్యర్ తో సెటిల్ మెంట్ వుంది. నైజాం సునీల్ తో సోమవారం సెటిల్ మెంట్ వుంటుంది.

శంకర్ సినిమా అంటే.. భారీతనం, డిఫరెంట్ టేకింగ్, స్టైలిష్ మేకింగ్