మహర్షి సినిమా తరువాత మహేష్ బాబు చేయబోయే సినిమాకు నిర్మాతలు ఇద్దరు. అనిల్ సుంకర, దిల్ రాజు. ఇది నిన్నటివరకు వినిపించిన, వినిపిస్తున్న విషయం. అయితే లేటెస్ట్ వార్త వేరుగా వుంది. నిర్మాత దిల్ రాజు డ్రాప్ అయ్యారో? లేదా మహేష్ బాబు మహర్షి ఎక్స్ పీరియన్స్ తో ఇద్దరు ముగ్గురిని కలిపి సినిమా చేయకూడదని అనుకున్నారో, మొత్తానికి మహేష్ బాబు 26వ సినిమాకు అనిల్ సుంకరనే సోలో నిర్మాత.
అయితే ప్రస్తుతం ఇదంతా పైకి ఎవ్వరూ చెప్పడంలేదు. కానీ విషయం అయితే ఇదే. ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడికి తొమ్మిది కోట్ల భారీ రెమ్యూనిరేషన్ ఇస్తున్నారు. అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతోనే మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు. అలాగే నిర్మాత, నటుడు బండ్లగణేష్ కూడా ఈ సినిమాతో మళ్లీ మొహానికి మేకప్ వేసుకుంటున్నారు.
ఈ సినిమా విషయంలో అనిల్ సుంకరకు, మహేష్ బాబుకు ఏదో ఒప్పందం వుందని, ఆ ఒప్పందం ప్రకారం మహేష్ కు భారీ రెమ్యూనిరేషన్ వస్తుందని కూడా గుసగుసలు వున్నాయి.