దేవదాస్ సెటిల్ మెంట్లు షురూ

మహర్షి సినిమా విడుదలను టెన్షన్ లో నెట్టే ప్రయత్నం చేసిన దేవదాస్ సమస్య కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. దేవదాస్ సినిమా విడుదల సమయంలో మార్కెట్ అంచనాల కన్నా కాస్త ఎక్కువ మొత్తాలు నిర్మాత అశ్వనీదత్…

మహర్షి సినిమా విడుదలను టెన్షన్ లో నెట్టే ప్రయత్నం చేసిన దేవదాస్ సమస్య కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. దేవదాస్ సినిమా విడుదల సమయంలో మార్కెట్ అంచనాల కన్నా కాస్త ఎక్కువ మొత్తాలు నిర్మాత అశ్వనీదత్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వాటిని వీలయినంత త్వరగా వడ్డీతో సెటిల్ చేస్తా అని ఆయన అప్పట్లో బయ్యర్లకు లిఖితపూర్వకంగా అగ్రిమెంట్లు చేసినట్లు తెలుస్తోంది. 

దీంతో పలు ఏరియాల బయ్యర్లు లోకల్ అసోసియేషన్లలో ఈ మేరకు ఫిర్యాదులు చేయడం, ఈస్ట్ గోదావరిలో అయితే ఏకంగా బాకీలు తీరేవరకు మహర్షి విడుదల చేయకూడదని తీర్మానం చేయడం కూడా జరిగింది. నైజాంలో సునీల్ కూడా చాంబర్ లో పేపర్స్ వుంచి, రెడీగావున్నారు.

ఇదంతా చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం కనిపిస్తోంది. దాంతో అశ్వనీదత్, ఆయన కుమార్తె స్వప్నదత్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎవరెవరికయితే బకాయిలు వున్నారో వారందరికీ ఫోన్ లు చేసారు. హైదరాబాద్ రమ్మని కబురు చేసారు. వాళ్లందరూ ఈరోజు రేపు వస్తున్నారని బోగట్టా.

మరి డిస్కషన్లు చేస్తారో? సెటిల్ మెంట్లు చేస్తారో? లేదా అగ్రమెంట్ల ప్రకారం పేమెంట్లు చేస్తారో రేపు కానీ తెలియదు. 

జమ్మలమడుగులో ఏం జరిగింది? జగన్ గేమ్ తో టీడీపీకి చెక్?