ఆర్ ఎక్స్ 100లాంటి బుల్లెట్ లాంటి సినిమాను గురి తప్పకుండా షూట్ చేసి, టాలీవుడ్ దృష్టిలో పడ్డాడు దర్శకుడు అజయ్ భూపతి. కానీ తరువాత ప్రాజెక్టునే అంత సులువుగా సెట్ కావడంలేదు. రకరకాల బ్యానర్లు, రకరకాల హీరోల పేర్లు వినిపించాయి. కానీ ఏదీ ఫైనల్ కాలేదు. కొందరయితే అత్యుత్సాహంతో నాగచైతన్యను-సమంతను జోడికట్టి మరీ వార్తలు రాసేసారు.
గ్రౌండ్ రియాల్టీ ఏమిటంటే చైతన్యకు ఈ సినిమాకు సంబంధమే లేదు. చైతన్య లైనప్ వేరు. వెంకీమామ సినిమా తరువాత చేయబోయేది మేర్లపాక గాంధీ డైరక్షన్ లో యువి క్రియేషన్స్ సినిమా. ఆ తరువాత చేయబోయేది దిల్ రాజు సినిమా. దీనికి కొత్త దర్శకుడు పనిచేస్తారు. వీటి మధ్యలో స్వంత బ్యానర్ మీద రామరాజు సినిమా చేయాల్సి వుంది.
ఇలాంటి నేపథ్యంలో అజయ్ భూపతి ఎవరితో సినిమా చేయబోతున్నాడు అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. అతని మదిలో సీనియర్ హీరో రవితేజ వున్నాడని కూడా తెలుస్తోంది. కానీ ఇంకా ఏ బ్యానర్ అన్నది సెట్ కాలేదు కాబట్టి, హీరో కూడా సెట్ కానట్లే. ముఖ్యంగా నాగచైతన్య అయితే పక్కాగా లేనట్లే.