తత్వం బోధపడింది.. సినిమా బడ్జెట్ తగ్గింది

హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాకు కూడా బడ్జెట్ విషయంలో తగ్గలేదు. ఇక అప్పట్నుంచి, ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అయిన సీత వరకు బెల్లంకొండ సినిమాల బడ్జెట్ ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది.…

హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాకు కూడా బడ్జెట్ విషయంలో తగ్గలేదు. ఇక అప్పట్నుంచి, ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అయిన సీత వరకు బెల్లంకొండ సినిమాల బడ్జెట్ ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. బడ్జెట్ ను తగ్గించుకుందామనే ఆలోచన కూడా చేయలేదు ఇప్పటివరకు. అలా మితిమీరిన బడ్జెట్ తో అతడి సినిమాలు బయ్యర్లకు నష్టాలు తెస్తూనే ఉన్నాయి.

ఎట్టకేలకు బెల్లంకొండకు విషయం అర్థమైనట్టుంది. ఈసారి అతి తక్కువ బడ్జెట్ లో సినిమా చేస్తున్నాడు. అదే రాక్షసుడు. తమిళ్ లో హిట్ అయిన రాట్ససన్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ రాక్షసుడు కోసం అటుఇటుగా కేవలం 15 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే (పారితోషికాలు కాకుండా) కేటాయించారట. ఇంకా చెప్పాలంటే బడ్జెట్ 15 కోట్ల మార్క్ కూడా టచ్ చేయలేదు.

ఈ సినిమాను ఇంత తక్కువ బడ్జెట్ లో తీయడానికి మరో కారణం కూడా ఉంది. బెల్లంకొండ మార్కెట్ పడిపోయిందనేది ఒక రీజన్ అయితే.. ఈ సినిమాలో మిగతా జనాలకు కూడా పెద్దగా మార్కెట్ లేదు. అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోయిన్ మెటీరియల్ కాదు.

ఇక దర్శకుడు రమేష్ వర్మ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇతడు ఎప్పుడో ఫేడ్-అవుట్ అయ్యాడు. సంగీత దర్శకుడు కూడా స్టార్ కాదు. పైగా ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ కాదు. క్రైమ్ థ్రిల్లర్ జానర్. ఇలాంటి యూనిట్ ను, ఈ జానర్ కథను పెట్టుకొని భారీ బడ్జెట్ పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. పైగా ఈసారి బెల్లంకొండ సినిమాలు కొనేది లేదని ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు అల్టిమేటం ఇచ్చారు.

అందుకే రాక్షసుడు సినిమాను తక్కువ బడ్జెట్ లో తీసి, బయ్యర్లు కోట్ చేసిన మొత్తాలకే ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఇదంతా సీత రిలీజ్ కు ముందు వ్యవహారం. సీత వచ్చి సినిమా హిట్ అయితే, అప్పుడు రాక్షసుడు లెక్కలు మళ్లీ మారిపోతాయ్. 

జమ్మలమడుగులో ఏం జరిగింది? జగన్ గేమ్ తో టీడీపీకి చెక్?