విదేశీనో, స్వదేశీనో వేరే సినిమాలు చూసి ప్రభావితం కావడం అన్నది దర్శకుడు రాజమౌళికి అలవాటు. ఇది కాపీనా? అని అడిగితేకాదు ఇన్ స్పయిర్ అయ్యాను అని ఆయన సమాధానం ఇచ్చిన రోజులు వున్నాయి. లేటెస్ట్ గా ఆయన చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ లవ్ ట్రాక్ ను అలనాటి ఎవర్ గ్రీన్ హిట్ అడవిరాముడు నుంచి ప్రభావితం అయి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అడవిరాముడు సినిమాలో ఎన్టీఆర్ కు ఇద్దరు హీరోయిన్లు. ఒకరు పట్నం అమ్మాయి. మరొకరు అడవిబిడ్డ. అటు జయప్రద, ఇటు జయసుధ. ఆ ముగ్గురి మధ్య సరదాపాట. ఆఖరికి జయసుధ మా అన్నలాంటోడు అనడంతో ఆ కథ అలా సుఖాంతం అవుతుంది.
ఆర్ ఆర్ ఆర్ లో కూడా ఎన్టీఆర్ కు ఇద్దరు హీరోయిన్లు. వారిలో ఒకరు అడవి బిడ్డ, మరొకరు విదేశీ వనిత అనిపిస్తోంది. ఈ అడవిబిడ్డ పాత్రకే పొట్టిపిల్ల నిత్యామీనన్ తో ఆ మధ్య డిస్కషన్లు నడిచాయి. అడవిరామడులో జయసుధ కూడా పొట్టిపిల్లే కాడవం గమనించాల్సిన విషయం.
మరి ఇంతకీ రామ్ చరణ్ లవ్ ట్రాక్ ఏమిటో? అది బయటకు కాస్త పొక్కితే, అప్పుడు దాని మీద కూడా గుసగుసలు వినిపిస్తాయేమో?