కుదటపడిన జెర్సీ

నాని-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో విడుదలైన సినిమ జెర్సీ. ఈ సినిమాకు అద్భుతమైన టాక్, సమీక్షలు, రేటింగ్ వచ్చింది. ముందుగా అనుకున్నట్లు ఫస్ట్ వీక్ లో విడుదలైతే ఎలా వుండేదో? లేదా కాంచన 3…

నాని-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో విడుదలైన సినిమ జెర్సీ. ఈ సినిమాకు అద్భుతమైన టాక్, సమీక్షలు, రేటింగ్ వచ్చింది. ముందుగా అనుకున్నట్లు ఫస్ట్ వీక్ లో విడుదలైతే ఎలా వుండేదో? లేదా కాంచన 3 పోటీలేకుండా వుంటే ఎలా వుండేదో? 19న రావడం, పోటీవుండడంతో కలెక్షన్లు ఆశించినంతగా కుమ్మేయలేదు. అయితే సినిమాను మరీ భారీ రేట్లకు అమ్మకపోవడం పనికి వచ్చింది. 

ఒక్క సీడెడ్ మినహా మిగిలిన చోట్ల దాదాపు బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చింది. మరో పదిరోజుల పాటు థియేటర్లలో కొత్త తెలుగు సినిమా లేదు. అందువల్ల దాదాపుగా సీడెడ్ మినహా మిగిలిన బయ్యర్లు అంతా బ్ర్రేక్ ఈవెన్ అయిపోతారని అనుకోవచ్చు. ఏమైనా సినిమాకు వచ్చిన, టాక్, సమీక్షలు, రేటింగ్ లతో పోల్చుకుంటే ఈ కలెక్షన్లు తక్కువే. కానీ బయ్యర్లకు మళ్లీ పెద్దగా వెనక్కు ఇవ్వాల్సిన పనిలేకుండా జరగడం నిర్మాతల అదృష్టం.

అవెంజర్స్ రాక ముందు మరీ కుమ్మేయలేదు. అలా అని మరీ డీలా లేదు. వచ్చిన తరువాత ఫస్ట్ డే కాస్త ఇబ్బంది అయినా మళ్లీ శని, ఆదివారాలు బాగుంది. అందువల్ల బయ్యర్లు గట్టెక్కేస్తారని ట్రేడ్ వర్గాల అంచనా.

కలెక్షన్లు, అమ్మిన రేట్లు (బ్రాకెట్లలో) ఇలా వున్నాయి.
నైజాం…………. 8.37..(7.00) కోట్లు
సీడెడ్…………..2.06..(3.20)
వైజాగ్……………2.59..(3.00) 
ఈస్ట్,…………….1.42..(1.60)
వెస్ట్ ……………..0.96..(1.25)
కృష్ణ……………..1.41..(1.45)
గుంటూరు……….1.46..(1.80)
నెల్లూరు………….0.61..(0.67)

శింగనమలలో వైఎస్సార్సీపీ విజయకేతనం గ్యారెంటీనా!