మహర్షికి లాభం రాకున్నా ఇవ్వాల్సిందే?

140 కోట్ల మేరకు థియేటర్, నాన్ థియేట్రికల్ ఆదాయం తెచ్చుకుంది మహేష్ బాబు – వంశీ పైడిపల్లి సినిమా అని వార్తలు. అదే సమయంలో ఆ సినిమాకు 150 కోట్లు ఖర్చయింది. 10 కోట్లు…

140 కోట్ల మేరకు థియేటర్, నాన్ థియేట్రికల్ ఆదాయం తెచ్చుకుంది మహేష్ బాబు – వంశీ పైడిపల్లి సినిమా అని వార్తలు. అదే సమయంలో ఆ సినిమాకు 150 కోట్లు ఖర్చయింది. 10 కోట్లు టేబుల్ లాస్ అని కూడా వార్తలు. ఇలాంటి నేపథ్యంలో ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన అశ్వనీదత్ పాత బాకీలపై పలు జిల్లాల్లో బయ్యర్ల గొడవలు.

ఇలాంటి నేపథ్యంలో అశ్వనీదత్ చాలా తెలివైన అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దేవదాస్ కు అశ్వనీదత్ అమ్మకాల కన్నా ఎక్కువ మొత్తాలు బయ్యర్ల దగ్గర తీసుకున్నారు. సినిమాను రెండు కోట్లకు అమ్మితే, మరో కోటి ఇవ్వండి తరువాత చూసుకుందాం, వసూళ్లు రాకపోతే, వడ్డీతో ఇస్తా అని అగ్రిమెంట్ లు చేసారని టాక్. ఇలాంటి అన్నీకలిసి మహా అయితే ఓ పదికోట్ల లోపే వుంటాయి.

అందుకే వాటిని మహర్షి పద్దులో రాయించే ప్రయత్నం దత్తుగారు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహర్షి సినిమా ఖర్చు, లాభం, నష్టంతో తనకు సంబంధం లేదు, తనకు 15 కోట్లు షేర్ కింద ఇవ్వాల్సిందే అని అశ్వనీదత్ పట్టుపడుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. లాభంరాలేదు అంటే దత్ వినడంలేదని తెలుస్తోంది. పైగా ఈ విషయంలో మరో నిర్మాత పివిపిని కూడా తనవైపు లాగాలని అశ్వనీదత్ ప్రయత్నిస్తున్నట్లు బోగట్టా.

మొత్తంమీద ఒక విషయం మాత్రం అర్థం అవుతోంది. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో దాదాపు 150 కోట్లు పెట్టి సినిమా తీస్తే నిర్మాతకు రూపాయి రావడంలేదు అన్నది. 

శింగనమలలో వైఎస్సార్సీపీ విజయకేతనం గ్యారెంటీనా!