పుష్ప-ది రైజర్..చైనాలో

గ్యాసిప్ లు సరే, వినిపించే వార్తలు సరే, సినిమాలు నిర్మించే నిర్మాతలు అసలేం అనుకుంటున్నారు? తాత్కాలికంగానైనా తమ తమ సినిమాల విడుదల ఎప్పుడు వుండొచ్చు అని అనుకుంటున్నారు. అన్నది ఆరా తీస్తే… Advertisement బన్నీ…

గ్యాసిప్ లు సరే, వినిపించే వార్తలు సరే, సినిమాలు నిర్మించే నిర్మాతలు అసలేం అనుకుంటున్నారు? తాత్కాలికంగానైనా తమ తమ సినిమాల విడుదల ఎప్పుడు వుండొచ్చు అని అనుకుంటున్నారు. అన్నది ఆరా తీస్తే…

బన్నీ భారీ సినిమా పుష్ప పార్ట్ వన్ ను ఎలగైనా ఈ దసరాకు బరిలో దింపాలన్న ప్రయత్నం చేస్తున్నారట నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. కానీ దానికి దర్శకుడు సుకుమార్ కాబట్టి, వారి కోరిక ఏ మేరకు నెరవేరుతుందన్నది చూడాలి. తొలి భాగానికి ది రైజర్ అనే ట్యాగ్ లైన్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. తొలిభాగం క్లయిమాక్స్ చైనాలో వుంటుందని తెలుస్తోంది. 

మహేష్ బాబు సర్కారువారి పాట సినిమాకు ఓ భారీ విదేశీ షెడ్యూలు బకాయి వుంది. త్వరలో ఆ షెడ్యూలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్రాంతి బరిలోకి దిగడం పక్కా అన్నది నిర్మాతల ఆలోచన.

పవన్ సినిమా అయ్యప్పన్ రీమేక్ ను కూడా సంక్రాంతి బరిలోకి తీసుకురావాలన్నది నిర్మాతల ఆలోచన. మహేష్ సినిమాకు ఇబ్బంది లేకుండా పవన్ సినిమా డేట్ డిసైడ్ చేస్తారట.

జూలై మూడోవారంలో చైతూ-సాయిపల్లవిల లవ్ స్టోరీ విడుదల వుండే అవకాశం వుంది. ఆ వేళకు ఆంధ్రలో టికెట్ రేట్లు కొద్దిగా పెరుగుతాయని నిర్మాతలు ఆశాభావంతో వున్నారు. కరోనా వ్యవహారాల నుంచి జగన్ ఫ్రీ అయితే అప్పుడు సినిమా టికెట్ ల వ్యవహారం పై దృష్టి పెడతారని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు.

ప్రభాస్ రాధేశ్యామ్ ను ఓటిటికి అమ్మే ప్రయత్నం ఓ పక్క జరుగుతోంది. అయితే కాస్త భారీ అమౌంట్ ఆశిస్తుండడంతో ఓటిటి ప్లాట్ ఫారమ్ ల నుంచి ఆ మేరకు స్పందన కనిపించడం లేదు. అందువల్ల థియేటర్ లోకే రావాల్సి వుంటుంది. 

ఆచార్య సినిమాను దసరా బరిలోకి దింపడమా? సంక్రాంతి వరకు వేచి వుండడమా? అన్న మీమాంస తేలడం లేదు. దసరాకు అంటే పుష్ప సినిమా వుంటుంది. సంక్రాంతికి అంటే పవన్ సినిమా వుంటుంది. రెండూ మెగా హీరోల సినిమాలే. వాటికి ఆచార్య పోటీ అవుతుంది. కానీ ఆచార్య మేకర్ల ధీమా ఒకటే మెగాస్టార్ సినిమా వస్తే మిగిలిన సినిమాలు అవే పక్కకు తప్పుకుంటాయని.  

సాయి తేజ్ రిపబ్లిక్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలయింది. చకచకా రెడీ చేసి, సరైన స్లాట్ ఎప్పుడు దొరికితే అప్పుడు విడుదలకు సిద్దంగా వుండాలన్నది నిర్మాతల ప్లాన్.

నాగశౌర్య మూడు సినిమాలు నిర్మాణంలో వున్నాయి. మూడింటిలో రెండు సినిమాలకు జస్ట్ వన్ వీక్ మాత్రమే వర్క్ వుంది. మరో సినిమాకు ముఫై నలభై శాతం వర్క్ మిగిలింది. వరుడు కావలెను, లక్ష్య సినిమాలు ముందుగా బిఫోర్ దసరా కు కాస్త అటు ఇటుగా థియేటర్లలోకి వస్తాయి.