Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోలకు రాజమౌళి క్లారిటీ?

హీరోలకు రాజమౌళి క్లారిటీ?

రాజమౌళి భారీ సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల 2022 సంక్రాంతికే అని వార్తలు వినిపిస్తున్నాయని ముందుగానే వెల్లడించాం. 

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఈ మేరకు ఇద్దరు హీరోలు చరణ్, ఎన్టీఆర్ లకు దర్శకుడు క్లారిటీ ఇచ్చేసాడన్నది.

నిజానికి ఆర్ఆర్ఆర్ షూట్ పార్టీ మహా అయితే 20 రోజులకు మించి లేదని తెలుస్తోంది. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం చాలా వుంది. 

అయిదు నెలల సమయం వున్నా సంక్రాంతికి రావడం వీలవుతుందా? అలాగే టికెట్ రేట్ల వ్యవహారం తేలాలి. ఆర్ఆర్ఆర్ బడ్జెట్ కు సంక్రాంతి సీజన్ సరిపోవాలి వంటి వ్యవహారాలు వున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో రాజమౌళి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పటి వరకు సస్సెన్స్ గా వుంది. కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఇద్దరు హీరోలకు రాజమౌళి క్లారిటీ ఇచ్చేసారని, అలాగే ఆగస్టు నుంచి ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా మీదకు వెళ్తారని తెలుస్తోంది.

చరణ్ మాత్రం ఇంకా సినిమా ఫిక్స్ చేసుకోవాల్సి వుంది. శంకర్ తో సినిమా ఆలస్యం అయ్యేలా వుంది కనుక, ఈ గ్యాప్ లో మరో సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. దాని కోసం డైరక్టర్ ను అన్వేషిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?