Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

సమాంతరంగా మహేష్ రెండు సినిమాలు

సమాంతరంగా మహేష్ రెండు సినిమాలు

సాధారణంగా పెద్ద హీరోలు ఒక సినిమా తరువాత మరో సినిమా చేస్తారు. మరీ తప్పకపొతే తప్ప ఒకేసారి రెండు మూడు సినిమాలు హ్యాండిల్ చేయరు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో టాప్ హీరోలు కూడా ఇలా డేట్ లు అడ్జస్ట్ చేయక తప్పడం లేదు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ రూట్లో వున్నారు. రెండు మూడు సినిమాలకు విడతల వారీగా డేట్ లు ఇస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇలాగే చేయబోతున్నారు. 

ప్రస్తుతం ఆయన సర్కారువారి పాట సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఓ లెంగ్తీ విదేశీ షెడ్యూలు బకాయి వుంది. అతి త్వరలో సర్కారువారిపాట యూనిట్ ఛలో ఫారిన్ అంటూ బయల్దేరబోతోంది. 

ఈ షెడ్యూలు అయిపోగానే, మహేష్ తను తరువాత చేయబోయే త్రివిక్రమ్ సినిమా మీదకు వస్తారట. త్రివిక్రమ్ సినిమా ఓ షెడ్యూలు చేసి, మళ్లీ సర్కారువారి పాట సినిమా మీదకు వెళ్తారట. దాంతో ఆ సినిమా పూర్తయిపోతుంది.  వెంటనే మళ్లీ త్రివిక్రమ్ సినిమా మీదకు వస్తారట.

ఈ విధంగా చేయడం వల్ల 2022 సంక్రాంతికి సర్కారువారిపాట, సమ్మర్ కు త్రివిక్రమ్ సినిమా చాలా కంఫర్టబుల్ గా విడుదల చేయవచ్చన్నది మహేష్ ఆలోచనగా తెలుస్తోంది. 2020 జనవరి తరువాత ఇప్పటి వరకు మహేష్ సినిమా విడుదల కాలేదు. 

దాదాపు రెండేళ్ల గ్యాప్ లో సర్కారువారి పాట వస్తుంది. ఆ వెంటనే నాలుగు నెలల్లో త్రివిక్రమ్ సినిమా వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?