Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే నాకు నచ్చదు

హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే నాకు నచ్చదు

హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే తనకు నచ్చదంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. దానికి తనదైన శైలిలో విశ్లేషణ ఇస్తున్నాడు. ప్రేక్షకుల దృష్టిలో హీరోయిన్లు దేవతలతో సమానమని, అలాంటి దేవతలు గర్భవతులుగా హాస్పిటల్స్ లో ఉంటే చూసి తను తట్టుకోలేనని చెబుతున్నాడు.

"దేవతల్లాంటి హీరోయిన్లు మెటర్నటీ వార్డుల్లో నొప్పులు పడుతుంటే నేను చూడలేను. పిల్లల్ని కనాలనే కోరిక మనుషులకు మాత్రమే ఉంటుంది. దేవతలకు ఉంటుంది. కాబట్టి దేవతల్లాంటి హీరోయిన్లు కూడా పెళ్లిళ్లు చేసుకోకుండా దేవతల్లా ఉండాలి."

సాధారణ అమ్మాయిలతో పోలిస్తే హీరోయిన్లు మెంటల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారని, కాబట్టి కనీసం హీరోయిన్లయినా మగాళ్లను దూరం పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు పూరి జగన్నాధ్.

"కనీసం హీరోయిన్లయినా మగాళ్లను దూరం పెట్టాలి. ప్రేమ లేకపోతే చచ్చిపోతారా. సింగిల్ ఉమెన్ రైజ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. జయలలిత, మాయావతి, మమతాబెనర్జీ.. ఇలా ఎంతోమంది ఉన్నారు స్ఫూర్తి ఇవ్వడానికి. వీళ్లకు మగాళ్లు అవసరం లేదు. హాలీవుడ్ లో పెళ్లి పక్కనపెట్టిన స్టార్స్ చాలామంది ఉన్నారు. నిక్కీ మినాజ్, రిహన్నా, క్యాటీ పెర్రీ, జెన్నిఫర్ లారెన్స్, లేడీ గాగా, శాండ్రా బుల్లక్.. ఇలా చాలామంది ఉన్నారు. వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలి."

స్వర్గంలో కూడా రంభ, ఊర్వశి, మేనక పెళ్లిళ్లు చేసుకోలేదు కాబట్టే స్వర్గం అందరికీ ఇంట్రెస్టింగ్ గా ఉందంటున్నాడు పూరి. ఒకవేళ వాళ్లు కూడా పెళ్లిళ్లు చేసుకొని, గర్భం దాలిస్తే మనిషి చావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపడంటూ తనదైన స్టయిల్ లో చెప్పుకొచ్చాడు.

ఇకనైనా తన మాట విని హీరోయిన్లు దేవతల్లా ఆలోచించాలని, మంగళసూత్రాన్ని మరిచిపోవాలని అంటున్నాడు. హీరోయిన్లు మాత్రమే కాదని, అమ్మాయిలంతా స్ట్రాంగ్ విమెన్ గా మారాలని కోరుతున్నాడు. స్ట్రాంగ్ ఉమెన్ అని ఫీలైన అమ్మాయిలెవ్వరూ పెళ్లిళ్లు చేసుకోవద్దంటున్నాడు పూరి. అలాంటి వాళ్లు మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరని చెబుతున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?