ఈ మధ్య బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. దక్షిణాది నిర్మాత చేయిపట్టుకున్నాడు. సౌత్ హీరో కన్నుకొట్టాడు. ఇలా అంటూ ఉండడం. అలా అని క్లారిటీగా చెప్పరు. ఇప్పుడు ఈ జాబితాలో ఒకప్పటి నటి నీనా గుప్తా కూడా చేరారు.
బాలీవుడ్ లో అటు సినిమాల్లో, ఇటు టీవీల్లో సుదీర్ఘమైన కెరీర్ నీనా గుప్తాది. ఆమె ఈ మధ్యనే తన జీవితకథను గ్రంధస్థం చేసారు.
సచ్ కహా తో…అనే టైటిల్ లో రాసిన ఈ బుక్ లో అన్ని విషయాలతో పాటే ఓ దక్షిణాది నిర్మాత గురించి కూడా రాసారు. పేరు చెప్పుకండానే ఓ దక్షిణాది నిర్మాత ముంబాయి వచ్చి, హోటల్ లో దిగి తనకు కబురు చేసారని, ఓ చిన్న పాత్ర ఆఫర్ చేసారని రాసుకొచ్చారు.
తాను చేయలేనని చెప్పి, వెళ్లిపోదాం అనుకుంటే, ''..‘వెళతావా? ఎక్కడికి?’ అన్నాడు. . ‘నువ్వు రాత్రి ఇక్కడ గడపడం లేదా?’ అని అడిగాడు…'' అంటూ నీనా వెల్లడించింది. వెళ్తే వెళ్లు అంటూ తన బ్యాగ్ ను తనపైకి విసిరాడని ముక్తాయించింది.
సరే, ఇంతకీ ఆ నిర్మాత ఎవ్వరో? తను దక్షిణాదిన ఎందరో హీరోయిన్లను పరిచయం చేసానని ఆ నిర్మాత గొప్పగా చెప్పుకున్నాడని రాసింది నీనా.
నీనా యంగ్ ఏజ్ లో జరిగింది కనుక, అది నిన్నటి తరం నిర్మాత అయి వుండాలి. దక్షిణాదిన ఎక్కువ మంది కొత్త హీరోయిన్లను పరిచయం చేసిన నిర్మాత ఎవ్వరో ?
ఓ ప్రముఖ తెలుగు నిర్మాత ఇలాగే చెప్పుకునేవారు అని అంటారు. అంతే కాదు, తన సినిమాల్లో నటించిన ప్రతి హీరోయిన్ కు కారు కొనిచ్చా అని ఆ నిర్మాత చెప్పుకునేవారు అంటారు.
కొంపదీసి ఈ నిర్మాత..ఆ నిర్మాత ఒకరు కాదు కదా?